Begin typing your search above and press return to search.
బాస్ కు ముందే ఘోస్ట్ ను ముగించే ప్లాన్
By: Tupaki Desk | 31 Jan 2022 11:30 PM GMTనాగార్జున ఆరు పదుల వయసు దాటినా కూడా ఇంకా కుర్రాడి మాదిరిగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లు చేస్తూ ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బంగార్రాజు సినిమాను సంక్రాంతికి తీసుకు రావడం కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు అనడంలో సందేహం లేదు. హీరోగా ప్రస్తుతం ఆయన ప్రవీన్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమాను చేస్తున్నాడు. రా ఏజెంట్ గా ఈ సినిమా లో నాగార్జున కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జున తో పాటు కాజల్ ను కీలక పాత్రకు ఎంపిక చేయడం జరిగింది. కాని కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడం.. ఇంతలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం వంటి కారణాలతో మరో హీరోయిన్ ను తీసుకోవడం జరిగింది.
ఇప్పటికే షూటింగ్ సగంకు పైగా పూర్తి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక కొత్త షెడ్యూల్ కు గాను చిత్ర యూనిట్ సభ్యులు దుబాయికి వెళ్లబోతున్నారు. దాదాపుగా మూడు వారాల పాటు దుబాయిలో కీలక సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ కి కూడా హోస్టింగ్ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలోనే ఈ షో ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగార్జున పై ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ బాస్ ఓటీటీ కి సంబంధించిన ప్రోమో షూట్ జరుగుతుందని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ది ఘోస్ట్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున మళ్లీ దుబాయి విమానం ఎక్కబోతున్నాడు.
నాగార్జున వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మరియు బిగ్ బాస్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవలే బంగార్రాజు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన నాగార్జున త్వరలోనే ది ఘోస్ట్ ను కూడా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ది ఘోస్ట్ సినిమా ను సమ్మర్ చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అది కాదంటే ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. ది ఘోస్ట్ సినిమా ను ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నారాయన్ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు మరియు శరత్ మరార్ లు కలిసి నిర్మిస్తున్నారు. నాగార్జున ది హోస్ట్ తో పాటు మరో వైపు బాలీవుడ్ భారీ మల్టీ స్టారర్ క్రేజీ మూవీ బ్రహ్మాస్త్ర ను కూడా చేస్తున్నాడు. ఆ సినిమా లో అత్యంత కీలక పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. ఒక వైపు వెండి తెర మరో వైపు బిగ్ బాస్ తో బుల్లి తెరను ఒకే సారి మెనేజ్ చేస్తున్న నాగార్జున ది గ్రేట్ అంటూ అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. నాగార్జున ను ది ఘోస్ట్ గా ఎప్పుడు చూసేది ఫిబ్రవరి చివరి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.