Begin typing your search above and press return to search.

ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..??

By:  Tupaki Desk   |   15 May 2020 9:50 AM GMT
ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..??
X
పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో ఈతరం ప్రేక్షకులు గుర్తుపట్టడం కష్టం. ఈ జెనరేషన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. సడెన్ గా చూస్తే 80.. 90 ల సిని ప్రేమికులు కూడా గుర్తు పట్టలేరు. ఎందుకంటే ఈ హీరోయిన్ వయసు ఇప్పుడు 50. నటించింది నాలుగైదు సినిమాలు.. వాటిలో ఒకటే హిట్టు. అదే నాగార్జున కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయిన 'గీతాంజలి'.

ఈమె పేరు గిరిజ అని కొంతమందికి గుర్తు రావొచ్చు. గిరిజ షెట్టార్. మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీతాంజలి' తర్వాత గిరిజ ఓ మూడు నాలుగు సినిమాల్లో నటించింది కానీ అవేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. 'గీతాంజలి' సినిమా చూసిన వారెవరూ గిరిజను మర్చిపోలేరు. ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా ఈమె ట్విట్టర్ లో గీతాంజలి సినిమాకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ను షేర్ చేసుకుంది. గిరిజ ట్విట్టర్ హ్యాండిల్ @intdobserver.

అప్పటి జెనరేషన్ వారికి గీతాంజలి సినిమా అంటే ఓ మరపురాని జ్ఞాపకం. ఇక అల్లరిపిల్ల పాత్రలో గిరిజ నటించిన తీరు కూడా ఎవరూ మర్చిపోలేరు. ఇంతకాలం తర్వాత అదే హీరోయిన్ ట్విట్టర్ లో యాక్టివ్ కావడం అప్పటి అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఇప్పటివారికి ఆ విషయం అర్థం కావాలంటే 'గీతాంజలి' సినిమాను ఏకాంతంగా.. యాడ్స్ డిస్టర్బెన్స్ లేకుండా.. జబర్దస్త్ జోకులు చెప్పే ఫ్రెండ్స్ పక్కన లేనప్పుడు చూడాలి.