Begin typing your search above and press return to search.
సమాధానం చెప్పినా..చెప్పకున్నా చంపేస్తా:నాగ్
By: Tupaki Desk | 20 Nov 2017 11:58 AM GMTనాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శివ తరహాలో మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందని నాగ్, వర్మలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. శివ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ.....అన్నపూర్ణ స్టుడియోలోని గ్లాస్ హౌస్లో వేసిన చైన్ సెట్లో నాగార్జునపై ఈ చిత్ర తొలి సన్నివేశాన్ని వర్మ చిత్రీకరించారు. శివ చిత్రానికి వర్మ తండ్రి క్లాప్ కొట్టగా....ఈ సినిమాకు వర్మ తల్లి క్లాప్ కొట్టారు. తొలి షాట్ లో కింగ్ నాగార్జున ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడట. అయితే, టెక్నికల్ రీజన్స్ తో నాగ్ తన ఫస్ట్ డైలాగ్ కు మూడు టేకులు తీసుకున్నాడట.
ఈ చిత్రంలో నాగ్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. వివేకం సినిమాలో అజిత్ తరహాలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నాగార్జున సీరియస్ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తొలి రోజు షూటింగ్ లో నాగ్....వర్మ మార్క్ పవర్ ఫుల్ డైలాగ్ ను తనదైన స్టైల్ లో చెప్పి ఇరగదీశాడు. ‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా.... నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావ్.. తక్కువ నొప్పితో చస్తావా ఎక్కువ నొప్పితో చస్తావా....చూస్.’ అంటూ అదిరిపోయే డైలాగ్ ను నాగ్ చెప్పాడట. అయితే, ఆ డైలాగ్ కోసం నాగ్ 3 టేక్ లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ టేక్ లో సౌండ్ ప్రాబ్లం వల్ల డైలాగ్ సరిగ్గా వినిపించలేదట. రెండో టేక్ లో కూడా లో వాయిస్ వినిపించిందట. దీంతో, ముచ్చటగా మూడో టేక్ లో నాగ్ ముహూర్తం షాట్ లో డైలాగ్ ను చెప్పాడట.