Begin typing your search above and press return to search.

శ్రీదేవిని తలుచుకుని నాగ్ ఎమోషనల్

By:  Tupaki Desk   |   26 May 2018 7:43 AM GMT
శ్రీదేవిని తలుచుకుని నాగ్ ఎమోషనల్
X
శ్రీదేవి చనిపోయి మూడు నెలలు దాటిపోయింది. ఆ విషాద వార్తను మరిచిపోయి అభిమానులు ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. ఇలాంటి తరుణంలో ఒకప్పటి ఆమె సహనటుడు అక్కినేని నాగార్జున ఓ ఇంగ్లిష్ డైలీతో శ్రీదేవి గురించి మాట్లాడాడు. శ్రీదేవి మరణం తనను కలచివేసిందంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆమె మృతి తర్వాత తాను కుటుంబ బంధాలకు ఇచ్చే విలువ మరింత పెరిగిందని నాగ్ చెప్పాడు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యుల విషయంలో తాను మరింత జాగ్రత్తగా.. ప్రొటెక్టివ్ గా ఉంటున్నానని అన్నాడు. తనకు కావాల్సిన వాళ్లతో మరింత ప్రేమగా.. బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయం గడుపుతున్నట్లు కూడా వెల్లడించాడు.

శ్రీదేవితో షూటింగ్ లో తనకెన్నో మంచి అనుభవాలున్నట్లు చెప్పాడు నాగ్. ఆమె సినిమా సెట్లో.. కెమెరా ముందు చాలా సంతోషంగా ఉండేదని నాగ్ తెలిపాడు. కెమెరా పక్కకు వెళ్లిపోగానే మామూలు జీవితంలోకి వచ్చేసేదని నాగ్ చెప్పాడు. శ్రీదేవి అద్భుతమైన నటి అని.. ఆమెతో కలిసి నటించడం తన అదృష్టమని అన్న నాగ్.. ఆమె మరణాన్ని తాను ఎప్పటికీ జీర్ణించుకోలేనని అన్నాడు. ఏఎన్నార్ తో ‘ప్రేమాభిషేకం’ సహా మరికొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన శ్రీదేవి.. తర్వాత నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’.. ‘గోవిందా గోవిందా’ చిత్రాల్లో నటించింది. తండ్రీ కొడుకులిద్దరికీ చక్కటి జోడీగా కనిపించడం ఆమెకే చెల్లింది. ఫిబ్రవరి నెలాఖర్లో దుబాయిలోని ఒక హోటల్లో శ్రీదేవి అనుమానాస్పద రీతిలో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే.