Begin typing your search above and press return to search.
నాగార్జున మళ్లీ బాలీవుడ్ కు..కారణం అదే..
By: Tupaki Desk | 2 Aug 2018 1:13 PM GMTకింగ్ నాగార్జున.. టాలీవుడ్ లో టాప్ హీరో.. అప్పట్లో బాలీవుడ్ కు వెళ్లి పలు సినిమాలు తీశాడు. కానీ సరైన ఫలితం రాకపోవడంతో తెలుగు సినిమాపైనే దృష్టి సారిస్తున్నాడు. కొత్త దర్శకులు, కొత్త కథలను ఎంచుకొని హిట్స్ కొడుతున్నాడు. కానీ ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగార్జున మళ్లీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘బ్రహ్మస్త్ర’ అనే మూవీలో చేయడానికి నాగార్జున ఒప్పుకున్నాడు.. ఈ సినిమా రూపకర్తలు అయాన్ ముఖర్జీ, కరణ్ జోహర్ లు వచ్చి కోరడంతో కాదనలేక ఒప్పుకున్నాడు.
నిజానికి ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో నాగార్జున కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడట.. కానీ అది డ్రీమ్ రోల్. కథను మలుపుతిప్పే పాత్ర. మొదట్లో నాగ్ ఇంత చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. త్రీడీ వెర్షన్ తీసుకొని రాగానే చూసి చేస్తానని ప్రకటించాడట.. ఇప్పటికే బ్రహ్మస్త్ర మూవీ కోసం బల్గేరియా షూటింగ్ లో పాల్గొన్నాడు. త్వరలోనే లండన్ లో నిర్వహించే షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడట.. ఇవన్నీ పూర్తయ్యాక ముంబైలో నిర్వహించే చివరి షెడ్యూల్ తో బ్రహ్మస్త్ర సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తాడని తెలిసింది.
ఇక తాజాగా నాగార్జున త్వరలోనే ఓ తమిళ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే అది ఏ చిత్రమో వెల్లడించలేదు. అది పెద్ద ప్రాజెక్టేనని.. ఇంకో వారం రోజుల్లో దాని గురించి అనౌన్స్ చేస్తానని తెలిపారు. తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలోనే నాగ్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.