Begin typing your search above and press return to search.

నాగ్ స్టెప్పులు మామూలుగా లేవసలు

By:  Tupaki Desk   |   7 Oct 2017 4:15 PM IST
నాగ్ స్టెప్పులు మామూలుగా లేవసలు
X
అక్కినేని వారి పెళ్లి వేడుకలో ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు గాని సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు మొత్తం వారి ఫొటోలే కనిపిసున్నాయి. అక్కినేని ఫ్యామిలీ వారు గడిపిన ప్రతి ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. నిన్న జరిగిన హిందూ సాంప్రదాయ పెళ్లి అయితే అక్కినేని వారు చాలా అట్టహాసంగా జరిపారు.

పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే పెళ్లి తర్వాత డిస్కో లైట్స్ లో అక్కినేని - దగ్గుపాటి వారసులు చిందులు వేశారు.ముఖ్యంగా చైతు - వెంకటేష్ తో కలిసి నాగ్ చిందులు వెయ్యడం స్పెషల్ గా ఉంది. డిస్కో లైట్స్ మధ్యన వారు సినిమాల్లో వేసిన స్టెప్పులు వేసి అందరిని అలరించారు. ఇక వెంకటేష్ కూడా తనదైన శైలిలో నవ్విస్తూ చిందులు వేశారు. చైతు తండ్రితో సమానంగా స్టెప్పులు వేసేందుకు ప్రయత్నించాడు.

అయితే ఆ పోటోలను అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పోటోలను అక్కినేని అభిమానులు షేర్ చేస్తూ.. చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.