Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో కూడా 'కింగ్' అనిపించుకున్న నాగ్...!

By:  Tupaki Desk   |   17 Jun 2020 5:30 PM GMT
సోషల్ మీడియాలో కూడా కింగ్ అనిపించుకున్న నాగ్...!
X
టాలీవుడ్ 'కింగ్' నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తనయులు నాగచైతన్య - అఖిల్ లు హీరోలుగా రాణిస్తుంటే.. వారికి పోటీగా అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నాడు. ఇటు సిల్వర్ స్క్రీన్ మీద కింగ్ అనిపించుకున్న నాగ్ స్మాల్ స్క్రీన్ మీద కూడా తన హవా చూపిస్తున్నాడు. ఇక నాగార్జునకి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నాగ్ తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కింగ్ నాగార్జున ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రికార్డు అందుకున్నారు.

సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌ లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డ్ సాధించారు. టాలీవుడ్ లో అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న సెకండ్ హీరోగా నిలిచాడు. అంతేకాకుండా సౌత్ ఇండియాలో 6 మిలియన్ ఫాలోవర్స్ ని క్రాస్ చేసిన నాల్గవ హీరోగా రికార్డ్ సాధించాడు. ఇదిలా ఉండగా గతేడాది 'మన్మథుడు 2' సినిమాతో నిరాశపరిచిన నాగార్జున ప్రస్తుతం సోలొమాన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ‘బ్రహ్మాస్త్ర’ అనే బాలీవుడ్ సినిమాలో అమితాబ్ రణబీర్ కపూర్ అలియాభట్ లతో కలిసి నటిస్తున్నారు. వీటితో పాటు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో 'బంగార్రాజు' సీక్వెల్ మరియు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా త్వరలో స్టార్ట్ కానున్న 'బిగ్ బాస్' 4వ సీజన్ కి నాగార్జున హోస్ట్ చేయనున్నారట.