Begin typing your search above and press return to search.

వాళ్లతో మల్టీ స్టారర్ కి నాగ్ కండిషన్స్

By:  Tupaki Desk   |   10 Feb 2017 5:59 AM GMT
వాళ్లతో మల్టీ స్టారర్ కి నాగ్ కండిషన్స్
X
మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు నాగార్జునకు పెద్దగా అభ్యంతరాలు ఏమీ ఉండవనే ఉండవనే విషయం ఇప్పటికే తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రెండ్ కాస్త ఊపందుకుంది కానీ.. దాదాపు దశాబ్దం క్రితమే ఇలాంటి ప్రయత్నం చేశాడు నాగ్. 2008లో నాగార్జున-మంచు విష్ణు కలిసి కృష్ణార్జున చిత్రాన్ని చేశారు. ఇందులో కృష్ణుడిగా కనిపిస్తాడు నాగ్.

రీసెంట్ గా కార్తితో కలిసి ఊపిరి మూవీలో కూడా నటించాడు నాగార్జున. ఇవి కుర్రాళ్లతో చేసిన సినిమాలు. మరి తన సమకాలికులు అయిన చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్ లతో మల్టీ స్టారర్ చేయడంపై నాగార్జున ఉద్దేశ్యం ఏంటి? తాజాగా ఓం నమో వేంకటేశాయ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగ్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. చిరు.. వెంకీ.. బాలయ్యలలో ఎవరితోనైనా సరే తాను మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమే అని చెప్పేశాడు నాగార్జున. కొత్త ప్రయోగాలను ప్రేక్షకులను కోరుకుంటున్నారని కూడా చెప్పిన నాగ్.. వీళ్లతో మల్టీస్టారర్ విషయంలో మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టాడు.

సీనియర్ హీరోలతో మల్టీ స్టారర్ కి సిద్ధమే అయినా.. ఇద్దరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉండడం మాత్రం తప్పని సరి అన్నాడు నాగ్. కథలో కేరక్టర్లకు ఇచ్చే ఇంపార్టెన్స్ లో తేడా ఉంటే.. ఫ్యాన్స్ హర్ట్ అవుతారని.. అలా కాకుండా సమ ప్రాధాన్యం ఇచ్చే స్క్రిప్ట్ తో ఎవరైనా ముందుకు వస్తే.. తప్పకుండా మల్టీస్టారర్ చేస్తానని చెప్పేశాడు నాగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/