Begin typing your search above and press return to search.

నాగ్ ఆ దర్శకుడిని లేజీ అని ఎందుకన్నాడంటే..

By:  Tupaki Desk   |   25 Sep 2018 9:50 AM GMT
నాగ్ ఆ దర్శకుడిని లేజీ అని ఎందుకన్నాడంటే..
X
దేవదాస్’ సినిమా ఆడియో వేడుకలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య లేజీ అనడం చర్చనీయాంశమైంది. నాగ్ సరదాగానే ఆ మాట అన్నప్పటికీ.. ఆయనకు ఆ అభిప్రాయం ఎందుకు కలిగిందా అన్న సందేహాలు జనాలకు కలిగాయి. తాజాగా ‘దేవదాస్’ టీమ్ అంతా కలిసి మంగళవారం ప్రెస్ మీట్ పెట్టగా.. అక్కడ ఓ విలేకరి నాగార్జునను ఇదే విషయమై ప్రశ్నించాడు. శ్రీరామ్ ను ఎందుకు లేజీ అన్నారు అని అడిగాడు. దీనికి నాగ్ వివరణ ఇచ్చాడు.

శ్రీరామ్ ప్రతిభావంతుడైన దర్శకుడని.. చిన్నవాడైనప్పటికీ చాలా పెద్ద టీంను చాలా బాగా నడిపించాడని అన్నాడు. ఐతే ఇంతమందిని కో ఆర్డినేట్ చేసుకుంటూ పని చేయడం వల్ల వచ్చిన ఒత్తిడి అతడిలో కొంచెం లేజీనెస్ పెంచి ఉండొచ్చని అన్నాడు నాగ్. తాను ప్రధానంగా లేజీ అన్నది ఫస్ట్ కాపీ తీయడంలో ఆలస్యం చేయడం వల్లే అని నాగ్ చెప్పాడు. ‘దేవదాస్’ ప్రివ్యూ షోను తాము మూడు రోజుల కిందటే చూశామని నాగ్ చెప్పాడు.

సినిమా బాగా వచ్చిందని.. కానీ ఇంత ఆలస్యంగా ఫస్ట్ కాపీ ఇవ్వడం వల్ల ఏవైనా మార్పులు చేయాలని అనుకున్నా చేసే అవకాశం ఉండదని నాగ్ అన్నాడు. అదే ఒక నెల రోజుల ముందే సినిమా రెడీ చేసి ఉంటే చూసుకుని ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశముండేదని నాగ్ చెప్పాడు. శ్రీరామ్ తో పాటు తాను దర్శకులందరికీ తాను ఇచ్చే సూచన ఒకటే అని.. విడుదలకు కొంచెం సమయం ఉండగానే సినిమాను పూర్తి చేస్తే తప్పులేవైనా సరిచూసుకోవడానికి అవకాశముంటుందని నాగ్ అన్నాడు.