Begin typing your search above and press return to search.

అఖిల్.. చైతూల పెళ్లి గురించి నాగ్ క్లారిటీ

By:  Tupaki Desk   |   8 Sep 2016 2:28 PM GMT
అఖిల్.. చైతూల పెళ్లి గురించి నాగ్ క్లారిటీ
X
కొడుకుల పెళ్లిళ్ల మీద స్పష్టత ఇచ్చేశారు ‘మన్మదుడు’. కొడుకులిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. పెద్దోడు నాగ చైతన్య.. ప్రముఖ హీరోయిన్ సమంతతో లవ్ ట్రాక్ మాంచి ఊపు మీద సాగుతుంటే.. చిన్నోడు అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ ప్రేమలో పడటం తెలిసిందే. అఖిల్ ప్రేమ ముచ్చట కాస్తంత ఓపెన్ అయినా.. చైతూ.. సమంతల లవ్ ట్రాక్ మీద మాత్రం ఇప్పటివరకూ అధికారిక కన్ఫర్మేషన్ లేదనే చెప్పాలి. అలాంటిది తాజాగా నాగార్జున ఇద్దరు కొడుకుల పెళ్లి ముచ్చట మీద పెదవి విప్పారు.

మొదట అఖిల్ పెళ్లి ముచ్చటకు వస్తే.. అఖిల్ నిశ్చితార్థం శ్రేయా భుపాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ తో డిసెంబరు 9న జరుగుతుందని.. అదంతా అఖిల్ ఇష్టం మేరకే ముహుర్తం నిర్ణయించినట్లుగా నాగ్ వెల్లడించారు. ఇక.. చైతూ – సమంతల లవ్ ట్రాక్ గురించి ప్రశ్నించిన మీడియాతో నర్మగర్భంగా తన మనసులోని మాటను చెప్పేశారు. ‘‘రోజూ మీరు రాస్తున్నారుగా. ఇక ఆ అంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొడుకుల సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదు’’ అంటూ విషయాన్ని ఓపెన్ చేసేశారు.

మరి.. చైతూ పెళ్లి మాటేమిటన్న ప్రశ్నకు బదిస్తే.. ఎప్పుడు పెళ్లి చేయమంటే అప్పుడు తాము సిద్ధమన్న నాగ్.. వచ్చే ఏడాది పెళ్లి బాజాలు మోగే వీలుందన్న విషయాన్ని చెప్పేశారు. మొత్తానికి తన మాటలతో నాగ్.. గాసిప్ రాయుళ్ల ఉపాధి మీద దెబ్బ కొట్టేశారే..?