Begin typing your search above and press return to search.

అఖిల్ ని తగ్గించుకోమంటున్న నాగ్..

By:  Tupaki Desk   |   30 Sept 2015 1:00 PM IST
అఖిల్ ని తగ్గించుకోమంటున్న నాగ్..
X
విజయదశమి రోజున.. అంటే అక్టోబర్ 22న అక్కినేని వారసుడు నటించిన అఖిల్ రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంబంధించిన టీంతో పాటు.. నాగార్జున కూడా తన ప్రతిభను మొత్తం ఉపయోగిస్తున్నాడు. అరంగేట్రంతోనే అద్భుతాలు సృష్టిస్తున్న అఖిల్ ని.. అన్ని రకాలుగానూ సూపర్ హిట్ అనిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి.. మొత్తం 2గంటల 40 నిమిషాల డ్యురేషన్ ఉండాలని డిసైడ్ అయ్యాడు డైరెక్టర్ వివి వినాయక్. అయితే.. ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాకపోయినా.. మూవీని ఆద్యంతం చూసిన నాగార్జున.. ఓ అరగంట మూవీ కట్ చేయాలని చెప్పాడట. లెంగ్త్ విషయంలో నిర్మాత నితిన్ తో పాటు, దర్శకుడు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నా.. ఎక్కడా లాగ్ అనిపించకుండా ఉండేందుకు నాగ్ ట్రై చేస్తున్నాడు. మూవీ చూస్తున్నంతసేపు ఆద్యంతం థ్రిల్ ఉండాలని, ఎక్కడా స్క్రిప్ట్ డ్రాగ్ అయినట్లు అనిపించకుండా ఉండాలన్నది నాగ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం రాకపోయినా.. నాగ్ నిర్ణయానికి తిరుగు ఉండకపోవచ్చు.

దీంతోపాటు చిన్న మూవీస్ కి కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఏ క్లాస్ సెంటర్లు - మల్టీప్లెక్సులు - ఓవర్సీస్ లలో ఎక్కువ షోలు పడతాయి. దీంతో అఖిల్ రన్ టైంని 2 గంటల 10 నిమిషాలకు లాక్ చేయమని నాగ్ గట్టిగానే చెబ్తున్నాడు. చివరకు దీనికే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.