Begin typing your search above and press return to search.

ఇక్క‌డ నాగార్జున‌.. అక్క‌డ జీవా

By:  Tupaki Desk   |   1 Nov 2015 5:21 AM GMT
ఇక్క‌డ నాగార్జున‌.. అక్క‌డ జీవా
X
అనుష్క క‌థానాయిక‌గా న‌టించిన సినిమా సైజ్ జీరో. కె.రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లి కాలంలో ఈ సినిమా గురించి విస్ర్త‌తంగా ప్ర‌చారం సాగించారు. సైజ్ జీరో పోస్ట‌ర్లు - ట్రైల‌ర్లు తెలుగు - త‌మిళ్ జ‌నాల‌కు బాగా న‌చ్చేశాయి. ఈ చిత్రాన్ని త‌మిళ్‌ లో ఇంజి ఇదుప‌గ‌జి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉండ‌నే ఉంది. సైజ్ జీరో చిత్రాన్ని న‌వంబ‌ర్ లో రిలీజ్ చేస్తున్నాం అని ఇదివ‌ర‌కే చెప్పారు.

అయితే ఇందులో కింగ్ నాగార్జున ఓ అతిధి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే నాగార్జున కేవ‌లం తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కే క‌నిపిస్తారు. త‌మిళ వెర్ష‌న్‌ లో క్రేజీ యంగ్ హీరో జీవా ఆ అతిధి పాత్ర‌లో న‌టిస్తార‌ని స‌మాచారం. జీవా సైజ్ జీరో హీరో ఆర్య‌కి క్లోజ్ ఫ్రెండ్‌. ఈ ఇద్ద‌రూ ఇదివ‌ర‌కే బాస్ ఎంగిర భాస్క‌ర‌న్ చిత్రంలో క‌లిసి న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి జీవా త‌న స్నేహితుడు ఆర్య కోసం ఈ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడుట‌. అదీ మ్యాట‌రు. సూర్య న‌టించిన ప‌సంగ 2 చిత్రంతో పాటు న‌వంబ‌ర్ 27న ఇంజి ఇదుప‌గ‌జి రిలీజ‌వుతుంద‌ని టాక్‌.