Begin typing your search above and press return to search.

నాగార్జున ఇన్నోవా..అల్లు అరవింద్‌ స్విఫ్ట్‌

By:  Tupaki Desk   |   10 Aug 2016 12:56 PM GMT
నాగార్జున ఇన్నోవా..అల్లు అరవింద్‌ స్విఫ్ట్‌
X
టాలీవుడ్ మ‌న్మ‌దుడు నాగార్జున కారు కొంటే..? టాలీవుడ్ బ‌డా నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ కొత్త కారు కొనుగోలు చేస్తే.. మినిమం బెంజ్‌.. లేదంటే ఆడి. ఈ విష‌యంలో మ‌రో మాట ఉండ‌నే ఉండ‌దు. కానీ.. తాజాగా వారు కొన్న కార్ల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఖ‌రీదైన కార్ల‌ను కొనుగోలు చేయ‌టానికి భిన్నంగా తాజాగా వీరిద్ద‌రూ కొన్న కొత్త కార్ల గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే.

తాము కొన్న కొత్త కార్ల రిజిస్ట్రేష‌న్ కోసం ఖైర‌తాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వ‌చ్చారు ఈ ఇద్ద‌రు టాలీవుడ్ ప్ర‌ముఖులు. ఇక‌.. వారు కొన్న కార్ల విష‌యానికి వ‌స్తే.. అక్కినేని నాగార్జున ఇన్నోవా వెహికిల్ కొనుగోలు చేస్తే.. అల్లు అర‌వింద్ మారుతి షిఫ్ట్ డిజైర్ కొన‌టం గ‌మ‌నార్హం. వీరి కొన్న కార్ల‌కు ఆర్టీఏ అధికారులు TS 09 EN 9669, TS 09 EN 9580 నెంబ‌ర్ల‌ను కేటాయించారు. టాలీవుడ్ కు చెందిన ఇద్ద‌రు బ‌డా ప్ర‌ముఖులు రావ‌టంతో అక్క‌డి అధికారులు వారితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇంత‌కీ.. ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖులు ఈ కార్లు కొన‌ట‌మేంటన్న‌ది అధికారుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డ‌వ‌టం విశేషం.