Begin typing your search above and press return to search.

ఐలవ్యూ చెప్పేసిన నాగార్జున

By:  Tupaki Desk   |   12 Sept 2017 1:01 PM IST
ఐలవ్యూ చెప్పేసిన నాగార్జున
X
అక్కినేని నాగార్జున ఎవరి విషయంలోనూ తన ప్రేమను.. ఉద్దేశ్యాలను దాచుకోరు. ఎంతో ఓపెన్ గా తన మనసులో మాట చెప్పేయడంలో నాగ్ బాగా సిద్ధహస్తులు. ఎలాంటి టాపిక్ ని అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసే నాగార్జున.. తన ప్రేమను చాటడంలో కూడా ప్రత్యేకత చూపిస్తారు.

నాగార్జున ఇప్పుడు ఐలవ్యూ చెప్పేశారు. అది కూడా సోషల్ మీడియా సాక్షిగా చెప్పారు నాగ్. అయితే.. ఇలా ఐలవ్యూ చెప్పినది తన భార్య అమలకే కావడమే విశేషం. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా తమ ఇద్దరి స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన నాగార్జున బర్త్ డే విషెస్ చెప్పారు. అది కూడా తన స్టైల్ లోనే కావడం హైలైట్. "ఐలవ్యూ స్వీట్ హార్ట్. నీ బర్త్ డే సంతోషంగా జరుపుకునే ఇలాంటి రోజులు నాకు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు నాగ్. అక్కినేని హీరో పోస్ట్ చూసి.. ఫ్యాన్స్ కూడా ఫాలో అవడం స్టార్ట్ చేసేశారు. అక్కినేని అమలకు తెగ విషెస్ చెప్పేస్తున్నారు.

అంతే కాదు.. నాగార్జున-అమల కలిసి గతంలో కనిపించిన సందర్భాలను.. సినిమాల్లో సన్నివేశాలను ఫోటోలుగా మలిచి నెట్ లో పోస్ట్ చేసేస్తున్నారు. మరోవైపు సామాజిక సేవలోనూ అమల ముందుంటారు. భరతనాట్యంలో బీఏ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ హోల్డర్ అయిన అమల.. శిక్షణ పొందిన భరతనాట్యం డ్యాన్సర్. హైద్రాబాద్ బ్లూ క్రాస్ ఫౌండర్ కూడా.