Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు క‌ళ్యాణ్ వెయిటింగ్ ఫ‌లించి..!

By:  Tupaki Desk   |   29 Feb 2020 10:45 AM IST
ఎట్ట‌కేల‌కు క‌ళ్యాణ్ వెయిటింగ్ ఫ‌లించి..!
X
కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన `సోగ్గాడే చిన్నినాయ‌నా` బంప‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ సినిమాకి సీక్వెల్ ప్రీక్వెల్ కాని క‌థ‌తో బంగార్రాజు తెర‌కెక్కుతుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అది సెట్స్ కెళ్ల‌లేదు. బౌండ్ స్క్రిప్ట్ విష‌యంలో కొంత‌కాలం వేచి చూశారు. అలాగే క‌ల్యాణ్ కృష్ణ సోద‌రుడి ఆక‌స్మిక మృతి వాయిదాకి కార‌ణ‌మైంది. అయితే ఇక అన్ని ర‌కాలుగా ఈ ప్రాజెక్టు కు లైన్ క్లియ‌రైంద‌ని తెలుస్తోంది.

జూన్ నుంచి నాగార్జున‌- క‌ళ్యాణ్ బృందం సెట్స్ పైకి వెళ్లేందుకు ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటుగా నాగ‌చైత‌న్య ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. సోగ్గాడే పెయిర్... నాగ్ - ర‌మ్య‌కృష్ణ జంట రిపీట్ కానుంది. చైతూ స‌ర‌స‌న నాయిక‌ను వెతుకుతున్నారు. ఇక మ‌నం లాంటి క్లాసిక్ హిట్ త‌ర్వాత బంగార్రాజు కోసం నాగార్జున - నాగ‌చైత‌న్య ప్రిపేర‌వుతుండ‌డం అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

ఓవైపు క‌మ్ముల‌తో లవ్ స్టోరి చిత్రీక‌ర‌ణ‌ లో బిజీగా ఉంటూనే వ‌రుస‌గా ప్రాజెక్టుల‌కు క‌మిట‌వుతున్నాడు. నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్ తో ఓ చిత్రం సెట్స్ కెళ్ల‌నుండ‌గా.. బంగార్రాజు సెట్స్ కి వెళ్లేందుకు చైతూ కాల్షీట్ల‌ను స‌ర్ధుబాటు చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున ఎన్.ఐ.ఏ అధికారి క‌థ‌తో తెర‌కెక్కుతున్న‌ `వైల్డ్ డాగ్` లో న‌టిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.