Begin typing your search above and press return to search.

మ‌హాభారతంలో నాగ్ పాత్ర అదేన‌ట‌!

By:  Tupaki Desk   |   24 May 2017 4:13 AM GMT
మ‌హాభారతంలో నాగ్ పాత్ర అదేన‌ట‌!
X
ఆ సినిమా.. సెట్స్ మీద‌కు రాకుండానే భారీ చ‌ర్చ‌కు తెర తీసింది. దానికి కార‌ణం.. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో క‌నివినీ ఎరుగ‌ని భారీ బ‌డ్జెట్‌తో సినిమాను ప్లాన్ చేయ‌డ‌మే కావ‌చ్చు. అదే.. మ‌హాభారతం! దాదాపు వెయ్యికోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్న ఈ సినిమాలో న‌టించేందుకు ఇప్ప‌టికే ప్ర‌ముఖ మ‌ల‌యాళ హీరో మోహ‌న్ లాల్ ఓకే చెప్పేయ‌టం తెలిసిందే. క‌థ ఆయ‌న సెంట్రిక్ గానే ఉంటుంది. ఈ సినిమాలో ప‌లు పాత్ర‌ల కోసం తెలుగుకు చెందిన హీరోల్ని అడిగిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే.. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో త‌న‌ను ఓ పాత్ర కోసం సంప్ర‌దించిన విష‌యాన్ని వెల్ల‌డించారు నాగ్‌. త‌న‌ను క‌ర్ణుడి వేషం వేయాల‌ని అడిగార‌ని.. స్క్రిప్ట్ మొత్తం చ‌దివాన‌ని.. చాలా బాగుంద‌న్నారు. క‌ర్ణుడి పాత్ర వేస్తారా? అని అడిగార‌ని.. చిన్న‌ పాత్ర అయినా ప్రాధాన్యం ఉంటే చేస్తాన‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. అన్ని ప‌నులు అయ్యాక త‌న ద‌గ్గ‌ర‌కు రావాల‌ని వారికి చెప్పిన‌ట్లుగా పేర్కొన్నారు. కృష్ణుడి పాత్ర‌కు బాగుంటారు క‌దా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు బదులిచ్చిన నాగ్‌.. ఆ వేషం వేస్తే మీసాలు తీయాల్సి వ‌స్తుంద‌ని..అది బాగుండ‌ద‌నే అంటూ త‌న‌దైన స్టైల్లో న‌వ్వేశారు నాగ్‌. సో.. మ‌హాభార‌తం భారీ ప్రాజెక్టులో మోహ‌న్ లాలే కాదు.. నాగ్ పాత్ర కూడా క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లేన‌ని అనుకోవాలా?