Begin typing your search above and press return to search.

అఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది

By:  Tupaki Desk   |   26 July 2017 11:12 AM IST
అఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది
X
తన సినిమా అయినా తన కొడుకుల సినిమా అయినా కూడా ఇప్పుడు కింగ్ నాగార్జున ఏ డేట్ చెబితే అదే ఫైనల్. ఆయన ఫిక్స్ చేస్తే అదే కరక్ట్. రాజు గారి గది సినిమాను ఫైనల్ గా ఒకసారి చూసి చాలా హ్యాపీ ఫీలైన నాగర్జున.. అక్టోబర్ 13న ఆ సినిమాను రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లు ప్రకటించేశాడు. అదే ఫ్లోలో ఆయన అఖిల్ కొత్త సినిమా షూటింగ్ ను కూడా ఓసారి పరిశీలించాడట.

అఖిల్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన నాగ్.. దర్శకుడు విక్రమ్ పనితనం మరియు సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ పనితనం చూసి అవాక్కయ్యాడట. ఆ తరువాత వారు తీసిన రషెస్ కొన్ని ఎడిటింగ్ రూమ్ లో చూసి స్టన్నయ్యాడట. దానితో ఇప్పుడు అఖిల్ సినిమాకు కూడా రిలీజ్ డేటును ఖరారు చేశాడు. డిసెంబర్ 22న అఖిల్ రెండో సినిమా విడదులవుతున్నట్లు తెలిపాడు నాగార్జున. గతంలో నాగ్ చేసిన చాలా సినిమాలను డిసెంబర్ లోనే విడుదల చేశాడు. అందుకే సెంటిమెంటల్ గా హిట్టు లేని అఖిల్ కోసం ఆ సెంటిమెంటును ఎన్నుకున్నాడేమో.

ఈ సినిమాను మనం మరియు 24 సినిమాలతో బాగా ఆకట్టుకున్న విక్రమ్ చాలా ప్రెస్టీజియస్ గా తీస్తున్నాడట. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇందులో సీనియర్ డైరక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను పరిశీలించాక చివరకు ఈ కొత్త అమ్మాయిని ఫైనల్ చేశారు.