Begin typing your search above and press return to search.

అవును.. వెంకీ-నాగ్ సినిమా చేస్తున్నారు

By:  Tupaki Desk   |   29 Oct 2015 11:30 AM GMT
అవును.. వెంకీ-నాగ్ సినిమా చేస్తున్నారు
X
దాదాపు పాతికేళ్ల క్రితమే అక్కినేని నాగార్జున - దగ్గుబాటి వెంకటేష్ కలిసి నటించాల్సింది. తమిళంలో సూపర్ హిట్టయిన మణిరత్నం సినిమా ‘అగ్నినక్షత్రం’ సినిమాను తెలుగులోకి నాగ్, వెంకీ హీరోలుగా రీమేక్ చేద్దామని చూశారు. అంతా ఓకే అనుకున్నాక ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. మణి సినిమా ‘ఘర్షణ’గా తెలుగులోకి డబ్ అయింది. ఆ తర్వాత కూడా నాగ్, వెంకీ కలిసి నటిస్తారని అప్పుడప్పుడూ వార్తలొచ్చాయి కానీ.. అది సాధ్యం కాలేదు. ఐతే ఇప్పుడు మళ్లీ నాగ్-వెంకీ కలయిక గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఐతే వాళ్లిద్దరూ ఓ సినిమాలో నటిస్తున్న మాట వాస్తవం. ఐతే అందులో వాళ్లవి హీరో పాత్రలు కాదు, గెస్ట్ రోల్స్ అని సమాచారం.

నాగచైతన్య హీరోగా తెరకెక్కబోయే ‘ప్రేమమ్’ రీమేక్‌ లో నాగ్ - వెంకీ గెస్ట్ క్యారెక్టర్లు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొడుకు కోసం నాగ్ - మేనల్లుడి కోసం వెంకీ ఈ క్యారెక్టర్లు చేయడానికి ఒప్పుకున్నారట. చైతూ కెరీర్ ఒడుదొడుకులతో సాగుతున్న నేపథ్యంలో ‘ప్రేమమ్’ సినిమా అతడి కెరీర్ కు పెద్ద మలుపు కాగలదని ఆశిస్తున్నారు. మంచి కథాంశం కావడం, చందూ మొండేటి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి సినిమాలో నాగ్ - వెంకీ గెస్ట్ రోల్స్ చేస్తే సినిమా రేంజి మరింత పెరుగుతుంది. అందుకే చందూ ప్రపోజల్ కు వాళ్లిద్దరూ ఓకే చెప్పారట.