Begin typing your search above and press return to search.

'శివ' మీద ప్రేమలా లేదు...

By:  Tupaki Desk   |   14 April 2015 5:23 PM GMT
శివ మీద ప్రేమలా లేదు...
X
ఈ సంవత్సరంతో సూపర్‌హిట్‌ క్లాసిక్‌ మూవీ ''శివ'' ఏకంగా 25 వసంతాలు పూర్తిచేసుకుంటోంది అనే విషయం తెలిసిందే. దీని గురించి ఆల్రెడీ నాగర్జున ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ చెప్పారు. అయితే ఈ శివ ను మే 15న మళ్ళీ రిలీజ్‌ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. కాని మనోళ్ళు ఈ సినిమాను ప్రమోట్‌ చేస్తున్న తీరు చూస్తుంటే.. ఇదేదో కేవలం
అభిమానుల కోసం రిలీజ్‌ చేస్తున్నట్లు లేదు.. ఆ క్లాసిక్‌పై మళ్ళీ కాసులు పండించాలనే టార్గెట్‌లా ఉంది.

మ్యాటర్‌ ఏంటంటే.. శివ సినిమాను ఇప్పుడు డిజిటల్‌లో కరెక్షన్‌ చేసి, దానికి సౌండ్‌ హంగులు దిద్ది.. దానిని మళ్ళీ ఓ కొత్త సినిమాలా రిలీజ్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రమోట్‌ చేయడానికి ఏకంగా 20 కొత్త రకం టీజర్‌ బిట్లుఉ కూడా కట్‌ చేస్తారట. ఒక్కోరోజు ఒక్కో క్యారెక్టర్‌ గురించి బైట్స్‌తో ఇరగదీస్తారట. ఇవన్నీ చూసి మళ్ళీ సినిమాకు ఓ 10 నుండి 15 కోట్లు కలెక్షన్‌ వచ్చినా వస్తుందని నాగ్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తోంది ఇది సినిమా మీద ప్రేమలా లేదనేది అందుకే. బాగానే ఉంది. మరి లాభాలొచ్చాక టెక్నీషియన్లకు కూడా మళ్ళీ రెమ్యూనరేషన్‌ ఇస్తారా సార్‌?