Begin typing your search above and press return to search.
నాగార్జున 2020 లో డబుల్ ధమాకానా?
By: Tupaki Desk | 31 Dec 2019 12:16 PM ISTఅక్కినేని హీరో నాగార్జున 'మన్మధుడు 2' చిత్రం ఫలితం తర్వాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. మన్మధుడు 2 సక్సెస్ అయితే ఇప్పటికే బంగార్రాజు చిత్రం సగం వరకు పూర్తి అయ్యేది. లేదంటే సంక్రాంతికే బంగార్రాజు వచ్చేవాడు. కాని మన్మధుడు 2 చిత్రం తర్వాత కాస్త విభిన్నమైన సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో బంగార్రాజు చిత్రాన్ని పక్క కు పెట్టాడు. ఇప్పుడు నాగార్జున 'వైల్డ్ డాగ్' అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.
అహిషోర్ సోలోమన్ దర్శకత్వం లో వైల్డ్ డాగ్ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో నాగార్జునను విభిన్నమైన పాత్రలో చూడబోతున్నాం. వైల్డ్ డాగ్ చిత్రం తర్వాత మళ్లీ నాగార్జున ఒక రొటీన్ రొమాంటిక్ చిత్రాన్ని చేస్తాడని అంతా భావించారు. కాని నాగార్జున మరోసారి కూడా అలాంటి విభిన్నమైన చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు. వైల్డ్ డాగ్ చిత్రం పూర్తి కాకుండానే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
2019లో ప్రేక్షకులను నిరాశ పర్చినందుకు గాను నాగార్జున 2020వ సంవత్సరం లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలని బాగా ఫిక్స్ అయినట్లున్నాడు. అందుకే వైల్డ్ డాగ్ చిత్రంతో పాటు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో చేయబోతున్న సినిమాను కూడా వచ్చే ఏడాది లోనే అంటే 2020లోనే విడుదల చేయాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాల పై నాగార్జున ఆశలు పెట్టుకున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా కాస్త వయసుకు తగ్గ పాత్రలు చేయాలని కూడా నాగార్జున ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం 2020లో మరో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కూడా ఒప్పుకునే అవకాశం ఉంది.