Begin typing your search above and press return to search.

అక్కినేని గ్లాస్ లో ఉంది వైట్ వైనేనా...?

By:  Tupaki Desk   |   12 Jun 2020 9:50 AM GMT
అక్కినేని గ్లాస్ లో ఉంది వైట్ వైనేనా...?
X
టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో అక్కినేని నాగార్జున - అమల జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్ గా వెలుగొందుతున్న సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట సిల్వర్ స్క్రీన్ పై 'ప్రేమయుద్ధం' 'కిరాయి దాదా' 'శివ' 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్న కింగ్ నాగార్జున - అమల దంపతులు నిన్న 28వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో నిన్న మొత్తం సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అక్కినేని అభిమానులు వీరి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతి ఏటా వివాహ వార్షికోత్సవాన్ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసుకునే ఈ జంట ఈ ఏడాది కూడా అదే పద్దతి ఫాలో అయింది. కాకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా ఇద్దరూ తమ వెడ్డింగ్ యానివర్సిటీ జరుపుకున్నారు. ఎప్పుడు అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి పెళ్లిరోజు జరుగుకునే ఈ జంట ఈసారి మాత్రం ఇద్దరు మాత్రమే జరుపుకున్నట్లున్నారు. తమ కుమారుడు అఖిల్ కూడా ఈ ఏడాది సోషల్ మీడియాలో కూడా తన తల్లిదండ్రులకు విషెస్ చెప్పలేదు.

కాగా అక్కినేని నాగార్జున తమకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పినందుకు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా నాగార్జున తన సతీమణి అమలతో కలిసి ఆనందంగా గడుపుతున్న ఒక పిక్ షేర్ చేసి ''ఇలాంటి ట్రబులింగ్ టైమ్ లో కూడా మాకు బ్లెస్సింగ్స్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. బీ వెల్ మై ఫ్రెండ్స్'' అంటూ పోస్టు చేసారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే నాగ్ పోస్ట్ చేసిన ఫోటోపై కాన్సన్ట్రేట్ చేసారు కొంతమంది నెటిజన్స్. ఆ ఫొటోలో నాగార్జున - అమల ముందు టేబుల్ పై ఉన్న ఐటమ్స్ పై నెటిజన్స్ దృష్టి పెట్టారు. గ్లాసుల్లో పోసి ఉన్న డ్రింక్ వైట్ వైనేనా అని డిస్కస్ చేసుకుంటున్నారు. నాగ్ అప్పుడప్పుడు డ్రింక్ చేస్తానని గతంలో చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగ్ పెళ్లిరోజును సెలెబ్రేట్ చేసుకుంటూ వైట్ వైన్ తాగుతున్నాడేమో అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు.