Begin typing your search above and press return to search.

మ‌జ్ను.. ఐదుగురి ఎమోష‌న్‌

By:  Tupaki Desk   |   22 Jan 2019 4:19 AM GMT
మ‌జ్ను.. ఐదుగురి ఎమోష‌న్‌
X
చియాన్ అఖిల్ .. అక్కినేని లెగ‌సీని ముందుకు తీసుకెళ‌తాడా? `అఖిల్` సినిమాతో డెబ్యూ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి అత‌డిపైనే ఆశ‌ల‌న్నీ. తాత ఏఎన్నార్ లెగ‌సీని విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపించ‌డంలో తండ్రి నాగార్జున పెద్ద స‌క్సెస‌య్యారు. త‌న‌కంటూ ప్ర‌త్యేకించి ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. స్టైల్‌ - ట్రెండ్ అన్న ప‌దాల‌కు చిరునామాగా మారారు నాగార్జున‌. అత‌డు స‌మ‌కాలిక హీరోల్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్. 90ల‌లో యూత్‌ కి అత‌డు ఓ స్ఫూర్తిగా నిలిచారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఆ త‌ర్వాత అంత పెద్ద వేవ్ ని అక్కినేని ఫ్యామిలీలో తేగ‌లిగేది ఎవ‌రు? స‌్టైల్ అన్న ప‌దానికి చిరునామాగా మారేది ఎవ‌రు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ నిరంత‌రం సాగుతూనే ఉంది.

ఓవైపు అక్కినేని నాగ‌చైత‌న్య‌ - మ‌రోవైపు అఖిల్ ఆ లెగ‌సీని ముందుకు తీసుకెళ్లాల‌న్న పంతంతో ఉన్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఉన్న ఠ‌ఫ్ కాంపిటీష‌న్ - ఆడియెన్ మైండ్ సెట్ లో మార్పు - క‌థ‌ల్లో ఛేంజోవ‌ర్.. వీట‌న్నిటి నేప‌థ్యంలో వార‌స‌త్వ హీరోయిజాన్ని విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్ల‌డం అంత సులువేం కాద‌ని చైతూ - అఖిల్ ఇద్ద‌రికీ ఈపాటికే అర్థ‌మై ఉంటుంది. చైత‌న్య ఇప్ప‌టివ‌ర‌కూ ఒడిదుడుకుల ప్ర‌పంచాన్ని అర్థం చేసుకుని పెద్ద విజ‌యం కోసం .. న‌టుడిగా కొత్త ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక అఖిల్ న‌టించిన తొలి రెండు సినిమాలు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. కానీ న‌టుడిగా అత‌డికి మంచి మార్కులే వేశారు క్రిటిక్స్.. ప్రేక్ష‌కులు. అందుకే ఇప్పుడు అత‌డి నుంచి వ‌స్తున్న మూడ‌వ సినిమా `మిస్ట‌ర్ మ‌జ్ను`పైనా ఆస‌క్తి నెల‌కొంది.

ఈ సినిమాతో ఐదుగురి ఎమోష‌న్ ముడిప‌డి ఉంది. నాగార్జున - అమ‌ల‌ - అఖిల్ - వెంకీ అట్లూరి - నిధి .. వీళ్లంద‌రి ఎమోష‌న్ ఈ సినిమా జ‌యాప‌జ‌యాల‌తో ముడిప‌డి ఉంది. ఇటీవ‌లే ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగ్ - అఖిల్ - నిధి క‌ళ్ల‌లో క‌న్నీటి పొర క‌నిపించింది. ఏదో తెలియ‌ని ఉద్వేగంలో ఉన్నార‌ని వీళ్ల‌ను చూస్తే అర్థ‌మైంది. ఎట్టి ప‌రిస్థితిలో అంద‌ని ద్రాక్ష‌లా ఉన్న ఆ ఒక్క హిట్టు అందుకుని స‌త్తా చాటాల‌ని అఖిల్ ఎంతో క‌సిగా క‌నిపిస్తున్నాడు. అయితే అఖిల్ గ‌త త‌ప్పిదాల నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా? లేదా? అన్న‌ది `మిస్ట‌ర్ మ‌జ్ను`నే తేల్చాలి. గొప్ప విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా తొలి రెండు సినిమాలు తీశారు. కానీ ఫీల్ మిస్స‌య్యింది.. స్టోరీలు జ‌నాల‌కు క‌నెక్ట‌వ్వ‌లేదు.. కామెడీ అస‌లే పండ‌క‌పోవ‌డం ఓ పెద్ద మైన‌స్ అయ్యింది. ఆ త‌ప్పుల‌న్నిటినీ మిస్ట‌ర్ మ‌జ్నులో అధిగ‌మించారా.. లేదా? ఈసారైనా ఫీల్ మిస్స‌వ్వ‌క‌పోతేనే ఛాన్స్.. ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. మిస్ట‌ర్ మ‌జ్ను సెన్సార్ పూర్త‌యింది. ఎలాంటి కట్స్ లేకుండా యుఏ స‌ర్టిఫికెట్ ద‌క్కింది. ప్ర‌స్తుతం సెన్సార్ బృందం ఏమ‌నుకుంటోంది? ఈ సినిమా ఫ‌లితం ఏంటి? అన్న‌ది తేలే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. 24 సాయంత్రం భారీగా ప్రీమియ‌ర్లకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రో రెండ్రోజుల్లోనే ఫ‌లితం ఏంటో తేల‌నుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.