Begin typing your search above and press return to search.

'బంగార్రాజు'లో బ్రహ్మీని అందుకే తీసుకోలేదట!

By:  Tupaki Desk   |   22 Jan 2022 3:46 AM GMT
బంగార్రాజులో బ్రహ్మీని అందుకే తీసుకోలేదట!
X
నాగార్జున - నాగచైతన్య కథానాయకులుగా కల్యాణ్ కృష్ణ 'బంగార్రాజు' సినిమాను రూపొందించాడు. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ .. పెద్ద బంగార్రాజుగా నాగార్జున .. చిన బంగార్రాజుగా చైతూ రొమాంటిక్ పాత్రల్లో కనిపించారు. యమలోకం ఎపిసోడ్ .. అనూప్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. మొదటి మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్బు లోకి చేరిపోయిన ఈ సినిమా, పండగ తరువాత కూడా తన జోరును చూపిస్తూ ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో నాగార్జున .. నాగచైతన్య ఇద్దరూ పాల్గొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ .. " సాధారణంగా బయట నేను చాలా సైలెంట్ గా ఉంటాను. కానీ ఈ సినిమాలో చాలా జోష్ తో కనిపించవలసి వచ్చింది. క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేసిందో అలా కనిపించవలసి ఉంటుంది. బయట నేను ఎంత సైలెంట్ గా ఉంటానో అంతే కంఫర్టుగా ఉంటాను. నా పాత్రకి ఏం కావాలో అది ఇవ్వడం ఒక యాక్టర్ గా నా బాధ్యత. నటుడు ఎప్పుడూ కూడా తన పాత్రను బట్టి మారిపోవలసి ఉంటుంది. అప్పుడే ఆ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది " అని చెప్పాడు.

ఇక నాగార్జున మాట్లాడుతూ .. ఈ సినిమాలో నేను .. చైతూ కలిసి నటించాము. మాతో పాటు అఖిల్ కూడా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని అంతా అడుగుతున్నారు. అలా చేయాలంటే అందుకు తగిన స్క్రిప్ట్ దొరకాలి. ఆ స్క్రిప్ట్ వినగానే మా ముగ్గురికీ అది సూట్ అవుతుంది అనిపించాలి. అప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది .. కావాలని చేయకూడదు. ఈ సినిమాలో చైతూను కూడా కావాలని పెట్టలేదు. 'బంగార్రాజు'లో పాత్రను చైతూను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయడం జరిగింది. అందువల్లనే ఆ పాత్ర చాలా సహజంగా అనిపిస్తుంది. ఆ కారణం వల్లనే ఆడియన్స్ కి ఆ పాత్ర కనెక్ట్ అయింది.

'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో ఉన్న బ్రహ్మానందం .. అనసూయ వంటి చాలామంది ఆర్టిస్టులు 'బంగార్రాజు'లో కనిపించరు. 'సోగ్గాడే చిన్నినాయనా'లో బ్రహ్మానందం గారు 'ఆత్మనందం' పాత్రలో ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. అలా అని చెప్పేసి ఆయన పాత్రను ఈ సినిమాలో పెట్టలేం. ఎందుకంటే ఇది తాత - మానవుడు స్టోరీ. అంటే మధ్యలో 30 ఏళ్లు గడిచిపోయాయి. అందువలన మళ్లీ బ్రహ్మానందం గారిని తీసుకోవడం కుదరలేదు. ఒకవేళ ఆయనను తీసుకుని ఉంటే 85 ఏళ్లకి పై బడిన పాత్రలో చూపించవలసి వస్తుంది .. అప్పుడు అది మరో పెద్ద కథ అవుతుంది. అందువల్లనే బ్రహ్మానందం గారిని తీసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.