Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మీ రాక మాకెంతో సంతోషం.. సుమండీ: నాగార్జున

By:  Tupaki Desk   |   25 March 2020 3:40 PM GMT
మెగాస్టార్ మీ రాక మాకెంతో సంతోషం.. సుమండీ: నాగార్జున
X
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో ఖాతా తెరవడం అభిమానులకు పెద్ద పండుగే అయిపోయింది. సరిగ్గా ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరు.. ట్విట్టర్ లో 'చిరంజీవి కొణిదెల' పేరుతో అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్.. ఈ సోషల్ మీడియా వేదికగా అభిమానుల తో మాట్లాడడం ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వెలిబుచ్చారు. అదేవిధంగా అందరికి శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు.

అంతేగాక తన మొదటి ట్వీట్ లో ఈ పర్వదినాన కరోనా మహమ్మారి బారిన ప్రపంచం చిక్కుకుపోవడం బాధాకరమని, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాను అంతం చేయడానికి అందరం కలిసికట్టుగా కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో సినీ ప్రముఖులంతా స్వాగతం పలికారు. కింగ్ నాగార్జున కూడా మెగాస్టార్ కి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. ఘన స్వాగతం పలికారు. మీ మాటలు ప్రస్తుతం బాధలలో ఉన్న వారికి మార్గనిర్దేశకం కావాలని తెలిపాడు. ఏదేమైనా మెగాస్టార్ సోషల్ మీడియాలోకి రావడంతో అభిమానులలో ఆనందం నెలకొంది.