Begin typing your search above and press return to search.

హాలీవుడ్ స్టయిల్ ఆఫీసర్

By:  Tupaki Desk   |   1 March 2018 8:32 AM GMT
హాలీవుడ్ స్టయిల్ ఆఫీసర్
X
కొంచెం గ్యాప్ తర్వాత రామ్ గోపాల్ వర్మ-నాగార్జునల కొత్త సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రానికి ‘ఆఫీసర్’ అనే టైటిల్ కన్ఫమ్ చేసి.. మే 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ‘ఆఫీసర్’ నిడివి కేవలం గంటా 45 నిమిషాలే అని సమాచారం.

హాలీవుడ్ స్టయిల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న వర్మ.. నిడివి విషయంలోనూ అదే శైలిని ఫాలో అవుతున్నాడట. ఇందులో పాటలేమీ ఉండవని.. ఏ డీవియేషన్ లేకుండా కథే ప్రధానంగా సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఓ కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తుండగా.. ఆమెతో నాగ్ రొమాంటిక్ సీన్స్ ఏమీ ఉండవని.. హీరోయిన్ ది ఒక పాత్ర మాత్రమే అని అంటున్నారు. సగం సినిమాలో యాక్షనే ఉంటుందని కూడా చెబుతున్నారు.

ఇంతకుముందు స్టార్ హీరోల సినిమాల్లో పాటలు లేకుండా జనాలు ఆశ్చర్యపోయేవాళ్లు. కానీ ఈ మధ్య జనాల ఆలోచన మారింది. పాటల్లేకున్నా యాక్సెప్ట్ చేస్తున్నారు. నాగ్ రఫ్ అండ్ టఫ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ‘ఆఫీసర్’ చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇంకొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ నెలలోనే షూటింగ్ ముగుస్తుందని.. వచ్చే నెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ చేసి మే 25న పక్కాగా సినిమాను విడుదల చేయాలనే ప్లాన్లో నాగ్-ఆర్జీవీ ఉన్నారని సమాచారం.