Begin typing your search above and press return to search.

చైతూ 'థ్యాంక్యూ' గురించి క్రేజీ గాసిప్..!

By:  Tupaki Desk   |   14 Dec 2020 4:30 PM GMT
చైతూ థ్యాంక్యూ గురించి క్రేజీ గాసిప్..!
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'మజిలీ' 'వెంకీమామ' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న చైతన్య.. ఇటీవలే 'థ్యాంక్యూ' అనే మరో చిత్రాన్ని ప్రకటించాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌ రాజు - శిరీష్‌ - హ‌ర్షిత్ రెడ్డి లు కలిసి నిర్మించనున్నారు. దీనికి బీవీఎస్‌ఎన్ రవి స్టోరీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. ఇందులో నాగచైతన్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు.

చైతూ 'థ్యాంక్యూ' చిత్రంలో నటిస్తున్న మూడు క్యారెక్టర్స్ లో ఒకటి యువ రైతు పాత్ర అని.. మరొకటి ఎన్నారై పాత్ర అని అంటున్నారు. అయితే మూడో పాత్ర ఎంటనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్టు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి రష్మిక మందన్నా - ప్రియాంక అరుల్ మోహన్ లను ఎంపిక చేశారని టాక్. ఈ సినిమా మీద అక్కినేని ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం అందించిన విక్రమ్ కె కుమార్.. ఇప్పుడు మరోసారి చైతన్య కి సూపర్ హిట్ అందిస్తాడని నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.