Begin typing your search above and press return to search.

కస్టడీ కంటే ఆ మూవీ చేసినా హిట్ అయ్యేదేమో

By:  Tupaki Desk   |   14 May 2023 10:34 AM GMT
కస్టడీ కంటే ఆ మూవీ చేసినా హిట్ అయ్యేదేమో
X
అక్కినేని ఫ్యామిలీ హీరోలకి ప్రస్తుతం రోజులు అంతగా కలిసి రావడం లేదేమో అనిపిస్తోంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ కొడదామని కలలు కంటే ఆ మూవీ కాస్తా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. అతని మూవీ సినిమా కంటే పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా అక్కినేని నాగ చైతన్య కస్టడీతో హిట్ కొట్టాలని కొత్తగా ట్రై చేశాడు.

కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరున్న వెంకట్ ప్రభు తెలుగులో చేసిన మొదటి మూవీ కస్టడీ. అయితే ఆయన మ్యాజిక్ మూవీలో ఎక్కడా కనిపించలేదనే టాక్ ఆడియన్స్ నుంచి వస్తోంది. కంటెంట్ బాగున్నా అందులో కొన్ని పాత్రలని అనవసరంగా ఇరికించి కథనం డీవియేట్ కావడానికి కారణం అయ్యాడనే అభిప్రాయం వస్తోంది. ఎవరేజ్ టాక్ అయితే వచ్చింది.

ఈ ఎవరేజ్ టాక్ తో ఎంత వరకు బ్రేక్ ఎవెన్ కలెక్షన్స్ అందుకుంటుంది చెప్పలేని పరిస్థితి. కమర్షియల్ ఫెయిల్యూర్ గానే కస్టడీ మారబోతోందని అర్ధం అవుతోంది.

అయితే దీనికంటే ముందు వెంకట్ ప్రభు మానాడు సినిమా శింబు, ఎస్ జె సూర్యతో చేసి హిట్ కొట్టాడు. ఇదే కథని నాగ చైతన్యకి ముందుగా వినిపించాడంట. దీంతో పాటు కస్టడీ స్టొరీ కూడా చెప్పాడంట.

అయితే చైతన్య కస్టడీ కథకి ఒకే చెప్పాడు. మానాడు సినిమాని ఒటీటీలో తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసేయడంతో రీమేక్ చేసిన ప్రయోజనం ఉండదని కస్టడీ కథపై వెళ్ళాడు. అయితే ఇప్పుడు అదే అతనికి మైనస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. మానాడు స్క్రిప్ట్ ని ఒకే చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి కథనంలో మరింత గ్రిప్ పెంచి తీస్తే హిట్ వచ్చేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మొత్తానికి థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ లని చైతన్య తన ఖాతాలో వేసుకున్నాడు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అయిన కాస్తా లైన్ మార్చి తనకి సెట్ అయ్యే స్టోరీస్ ఎంపిక చేసుకొని సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.