Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా మారిన నాగ‌చైత‌న్య న్యూ లుక్

By:  Tupaki Desk   |   4 Feb 2022 9:30 AM GMT
వైర‌ల్ గా మారిన నాగ‌చైత‌న్య న్యూ లుక్
X
రీసెంట్ గా సాయి ప‌ల్ల‌వితో క‌లిసి చేసిన `ల‌వ్ స్టోరీ`, తండ్రి కింగ్ నాగార్జునతో క‌లిసి న‌టించిన `బంగార్రాజు` బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్ లుగా నిల‌వ‌డంతో యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య రెట్టించిన ఉత్సాహంతో వున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ తెర‌కెక్కిస్తున్న `థాంక్యూ` చిత్రంలో న‌టిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో చైకి జోడీగా బెల్లం శ్రీ‌దేవి రాశీఖ‌న్నా, అవికా గోర్‌, మాళివిక నాయ‌ర్‌ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ ర‌ష్యా రాజ‌ధాని మాస్కో న‌గ‌రంలో జ‌రుగుతోంది.

అక్క‌డి సుంద‌ర‌మైన ప్ర‌దేశాల్లో కీల‌క షెడ్యూల్ ని చిత్రీక‌రిస్తున్నారు. మాస్కోలోని హెరిటేజ్‌బిల్డింగ్ ల నేప‌థ్యంలో మంచుతో క‌ప్పిన వీధుల్లో ఈ మూవీకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఓ ఫొటోని నాగ‌చైత‌న్య సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిగా అభిమానుల‌తో పంచుకున్నారు. ఇంటెన్స్ లుక్ తో గాగుల్స్ ధ‌రించి గ‌డ్డంతో చై స‌రికొత్త మేకోవ‌ర్ లో క‌నిపిస్తున్న తీరు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. చై షేర్ చేసిన ఈ ఫొటోని ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీ‌రామ్ క్లిక్ మ‌నిపించార‌ట‌.

సరికొత్త నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ `థాంక్యూ` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ల‌వ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలు సూప‌ర్ హిట్ కావ‌డంతో `థాంక్యూ`తో హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాల‌ని నాగ‌చైత‌న్య ప్లాన్ చేస్తున్నార‌ట‌. సినిమా కూడా ఊహ‌కంద‌ని ప్ర‌త్యేక‌త‌ల‌తో రూపొందుతుండ‌టంతో సినిమాపై చై బారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య .. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కు వీరాభిమానిగా క‌నిపిస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌మేష్ క‌టౌట్ కి నాగ‌చైత‌న్య పూలాభిషేకం చేస్తున్న ఓ వీడియో కూడా నెట్టింట ఆ మ‌ధ్య వైర‌ల్ కావ‌డంతో ఈ సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.

ఇదిలా వుంటే ఇదే ఏడాది నాగ‌చైత‌న్య బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖార్ న‌టిస్తున్న చిత్రం `లాల్ సింగ్ చ‌ద్దా`. ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కాబోతోంది.