Begin typing your search above and press return to search.

నాగ‌చైత‌న్య ఇప్ప‌టికీ అదే మెయింటైన్ చేస్తున్నారే!

By:  Tupaki Desk   |   28 April 2022 11:31 AM GMT
నాగ‌చైత‌న్య ఇప్ప‌టికీ అదే మెయింటైన్ చేస్తున్నారే!
X
యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య కెరీర్ ప్రారంభం నుంచి చాలా సైలెంట్ గా వుంటూ వ‌స్తున్నారు. ఇత‌ర విష‌యాల్లో జోక్యం చేసుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్ల‌డం నాగ‌చైత‌న్య స్టైల్‌. ఇప్ప‌టికీ అదే పంథాని మెయింటైన్ చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నారు. ఇటీవ‌ల స‌మంత‌కు విడాకులు ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి కూడా ఆయ‌న మౌనం పాటిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యంలో ఎలాంటి వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చినా పెద్ద‌గా రియాక్ట్ కాకుండా సైలెంట్ మోడ్ లో వుంటూ అదే మెయింటైన్ చేస్తూ వ‌స్తున్నారు.

సినిమాల ప‌రంగానూ చాలా లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తున్న చై ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సిరీస్ ల‌తో బిజీగా వున్నారు. ఇటీవ‌ల తండ్రి నాగార్జున‌తో క‌లిసి న‌టించిన 'బంగార్రాజు' ఫ‌ర‌వాలేద‌నిపించిందే కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది.

అయితే ఇదే స‌మ‌యంలో స‌మంత మాత్రం 'పుష్ప ది రైజ్'లో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించి టాక్ ఆఫ్ ది పాన్ ఇండియాగా మారిపోయింది. సామ్ తొలి సారి చేసిన 'ఊ అంటా వా మావ‌..' ఓ రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో సామ్ దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకుంది.

అంతే కాకుండా ఈ సాంగ్ తెచ్చిన క్రేజ్ తో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంది కూడా. నాగ‌చైత‌న్య‌ కూడా ఇదే స్థాయిలోక్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకున్నా సామ్ త‌ర‌హాలో మాత్రం వైర‌ల్ కాలేక‌పోయాడు. ఈ ఏడాది బాలీవుడ్ మిస్ట‌ర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన 'లాల్ సింగ్ చ‌ద్దా' మూవీతో నాగ‌చైత‌న్య బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో మిల‌ట‌రీ ఆఫీస‌ర్ గా చై గెస్ట్ రోల్ లో క‌నిపించ‌బోతున్నాడు.

ఈ మూవీతో పాటు తెలుగులో చైతూ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'థాంక్యూ'. విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాశీఖ‌న్నా, అవికా గోర్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. బిగ్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. ఇదిలా వుంటే ఇదే ఏడాది నాగ‌చైత‌న్య డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

తొలిసారి విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో చై ఓ వెబ్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ 'దూత‌'. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇందులో చై తొలిసారి నెగెటివ్ క్యారెక్ట‌ర్ లో క‌నిపిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సామ్ కు డైవ‌ర్స్ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి వ్య‌క్తి గ‌తంగానూ, సోష‌ల్ మీడియా వేదిక‌గానూ సైలెంట్ ని మెయింటైన్ చేస్తూ వ‌స్తున్న నాగ‌చైత‌న్య సామ్ బ‌ర్త్ డే రోజైనా స్పందిస్తారా? ల‌ఏక అదే సైలెంట్ ని మెయింటైన్ చేస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.