Begin typing your search above and press return to search.

రిలీజ్ కు రెండు సెట్స్ పై రెండు.. చైతూ జోరు

By:  Tupaki Desk   |   20 Aug 2021 3:31 PM IST
రిలీజ్ కు రెండు సెట్స్ పై రెండు.. చైతూ జోరు
X
అక్కినేని హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. కరోనా కారణంగా దాదాపుగా ఏడాదిన్నర కాలంగా చైతూ నుండి సినిమాలు ఏమీ రాలేదు. ఇప్పటికే ఆయన నటించిన లవ్‌ స్టోరీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. గత ఏడాదిలోనే లవ్‌ స్టోరీ విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఈ ఏడాది కి వాయిదా పడింది. సెకండ్‌ వేవ్‌ కారణంగా మరోసారి వాయిదా పడ్డ లవ్‌ స్టోరీ ఎట్టకేలకు వచ్చే నెలలో విడుదలకు సిద్దం అయ్యింది. లవ్‌ స్టోరీ విడుదల తర్వాత థ్యాంక్యూ మూవీ లైన్ లోకి రాబోతుంది. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన థ్యాంక్యూ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా సినిమాను చైతూ చేసిన విషయం తెల్సిందే.

అమీర్ ఖాన్ మూవీ అయిన లాల్ సింగ్‌ చద్దా లో కీలక పాత్రలో చైతూ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ ను కూడా చైతూ ముగించేశాడు. మూడు సినిమాలు లైన్ లో ఉన్న చైతూ మరో మూడు సినిమాలు కూడా లైన్‌ లో పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాను చైతూ చేయబోతున్న విషయం తెల్సిందే. నేడే ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. రెగ్యులర్‌ షూటింగ్ ను వెంటనే మొదలు పెట్టబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరో సినిమాను కూడా చైతూ ఓకే చెప్పాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అల్లరి నరేష్‌ లోని కొత్త యాంగిల్ ను చూపించిన దర్శకుడు విజయ్ కనకమేడల. ఈయన దర్శకత్వంలో చైతూ సినిమా కన్ఫర్మ్‌ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విజయ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు యంగ్‌ హీరోలు చాలా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అల్లరి నరేష్‌ వంటి కామెడీ హీరోను సీరియస్‌ మూడ్‌ లో చూపించడమే కాకుండా ఒక చక్కని మెసేజ్ ను కూడా జనాలకు ఇచ్చిన దర్శకుడిపై విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం నాంధి సినిమాలు పలు భాషల్లో రీమేక్ అవుతుంది అంటే సినిమా రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే చైతూ హీరోగా ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి రెండు సినిమాలు విడుదలకు సిద్దం చేసి పెట్టిన చైతూ మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నాడు. ఈ ఏడాదిలో లవ్‌ స్టోరీ విడుదల అయితే వచ్చే ఏడాది లో రెండు మూడు సినిమాలను చైతూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ఇంకా కొత్త సినిమాలను చైతూ బ్యాక్ టు బ్యాక్ మొదలు పెట్టేలా రెగ్యులర్ గా కథలు వింటూనే ఉన్నాడట.