Begin typing your search above and press return to search.

డ‌బుల్ మీనింగ్స్ పై చైతూ రివ‌ర్స్ కౌంట‌ర్‌!

By:  Tupaki Desk   |   5 July 2022 3:50 AM GMT
డ‌బుల్ మీనింగ్స్ పై చైతూ రివ‌ర్స్ కౌంట‌ర్‌!
X
మ‌న స్టార్స్ చాలా విష‌యాల్లో చాలా క్లియ‌ర్ క‌ట్ గా వుంటున్నారు. ఎక్క‌డా ఎలాంటి ప్ర‌శ్న ఎదురైనా వెంట‌నే త‌మ‌దైన స్టైల్లో రివ‌ర్స్ పంచ్ వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంద‌ర్భమే యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌కు ఎదురైంది. వెంట‌నే త‌న‌దైన స్టైల్లో పంచ్ వేసి అద‌ర‌గొట్టేశారు. వివ‌రాల్లోకి వెళితే... నాగ‌చైత‌న్య న‌టిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ 'థాంక్యూ'. 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న సోద‌రుడు శిరీష్ తో క‌లిసి శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. రాశిఖ‌న్నా, మ‌ళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్ లుగా న‌టించారు.

ఓ యువ‌కుడి య‌వ్వ‌న ద‌శ నుంచి మొద‌ల‌య్యే విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. నాగ‌చైత‌న్య ఈ మూవీలో మూడు భిన్న‌మైన గెట‌ప్ ల‌లో క‌నిపించ‌బోతున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 22న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఈ మూవీ ప్ర‌చారాన్ని స్పీడ‌ప్ చేసింది. ఇందులో భాగంగా '5 సెకండ్స్ రూల్‌' పేరుతో ఓ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూని హీరో, హీరోయిన్ ల‌తో ఏర్పాటు చేసింది.

యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు 5 సెకంన్ ల‌లో స‌మాధానం చెప్పాల‌న్న‌ది ఈ ఇంట‌ర్వ్యూ ప్ర‌ధాన ఉద్దేశ్యం. ఇందులో కొన్నింటికి ఫాస్ట్ గా స‌మాధానాలు చెప్పిన చై, రాశీఖ‌న్నా కొన్నింటికి మాత్రం చెప్ప‌లేక న‌వ్వులు పూయించారు.

ప్ర‌ముఖ కార్ల కంప‌నీలు, కుక్క‌ల జాతులు, గ‌ణిత సూత్రాలు, ర‌సాయ‌నాలు, భాష‌లు..ఇలా అన్ని స‌బ్జెక్ట్ ల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానాలు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో త‌మ స‌మాధానాల‌తో న‌వ్వులు పూయించారు.

ఇదే క్ర‌మంలో డ‌బుల్ మీనింగ్ ల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీంతో యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు నాగ‌చైత‌న్య త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్ వేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. 'నేను ఏ విష‌యాన్నైనా నేరుగా చెప్తా. అందులో డ‌బుల్ మీనింగ్ వుండ‌దు. ఆ డ‌బుల్ మీనింగ్ ప‌దాలేంటో నువ్వు చెప్పు తెలుసుకుంటా అంటూ చై తిరిగి కౌంట‌ర్ వేసిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. 'మ‌నం' త‌రువాత విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్ర‌మిది.

ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. చై హాకీ ప్లేయ‌ర్ గా, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఈ మూవీలో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న‌కు జోడీగా రాశిఖ‌న్నా న‌టిస్తోంది. 'వెంకీ మామ‌' మూవీ త‌రువాత వీరిద్ద‌రు క‌లిసి చేస్తున్న సినిమా ఇది. జూలై 22న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై నాగ‌చైత‌న్య భారీ అంచ‌నాలే పెట్టుకున్నార‌ట‌. ఈ మూవీతో పాటు విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో చై తొలిసారి 'ధూత' పేరుతో రూపొందుతున్న వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.