Begin typing your search above and press return to search.

అనసూయ సినిమా విడుదల తేదీని ప్రకటించిన నాగచైతన్య..!

By:  Tupaki Desk   |   17 April 2021 10:15 PM IST
అనసూయ సినిమా విడుదల తేదీని ప్రకటించిన నాగచైతన్య..!
X
యాంకర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ - అశ్విన్ విరాజ్‌ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ''థ్యాంక్ యు బ్ర‌ద‌ర్''. కొత్త దర్శకుడు ర‌మేష్ రాప‌ర్తి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జస్ట్‌ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి - తారకనాథ్‌ బొమ్మిరెడ్డిలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' రిలీజ్ పోస్టర్ వదిలి చిత్ర బృందానికి విషెస్ అందించాడు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని.. ఒక కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల తానెంతో ఆకర్షితుడైనట్లు చైతన్య తెలిపారు. ఇక ఈ చిత్రానికి సురేష్ ర‌గుతు సినిమాటోగ్రఫీ అందించగా.. గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వైవా హ‌ర్ష‌ - అర్చ‌నా అనంత్‌ - అనీష్ కురువిల్లా - మౌనికా రెడ్డి - ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌ - కాదంబ‌రి కిర‌ణ్‌ - అన్న‌పూర్ణ‌ - బాబీ రాఘ‌వేంద్ర‌ - స‌మీర్‌ ఇతర పాత్రలు పోషించారు.