Begin typing your search above and press return to search.

నిహారిక మెహందీ ఫంక్షన్ వీడియో షేర్ చేసిన నాగబాబు..!

By:  Tupaki Desk   |   15 Dec 2020 11:05 AM GMT
నిహారిక మెహందీ ఫంక్షన్ వీడియో షేర్ చేసిన నాగబాబు..!
X
మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్‌ లో గల ఉదయ్ విలాస్‌ లో డిసెంబర్ 9న రాత్రి 7:15 నిమిషాలకు జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి జరిగి వారం రోజులు గడుస్తున్నా సోషల్ మీడియాలో ఈ పెళ్లి గురించే చర్చలు జరుగుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా మెగా కుటుంబ సభ్యులు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నిహారిక - చైతన్య వివాహానికి సంబంధించిన ఓ వీడియోని నాగబాబు తన 'మన ఛానల్ మన ఇష్టం' యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు.

మా కుటుంబ సభ్యులు మొత్తం నిహారిక వివాహానికి హాజరయ్యారని, కళ్యాణ్ మాత్రం పొలిటికల్ ప్రెజర్ వల్ల సంగీత్ కి హాజరు కాలేదని.. కానీ మెహందీ ఫంక్షన్ కి అందుకున్నాడని నాగబాబు ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు.ఇందులో నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ లో భాగంగా జరిపిన మెహందీ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వీడియోలో కనిపిస్తున్నారు. చిరంజీవి - సురేఖ దంపతుల డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచనట్లు తెలుస్తోంది. నిహారిక తో పాటు చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత మరియు అల్లు అర్జున్ సతీమణి స్నేహ 'రాములో రాములా' పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చివర్లో పవన్ కళ్యాణ్ తో కలిసి అందరూ ఫోటోలు దిగడం కనిపిస్తోంది. మొత్తం మీద మెగా డాటర్ వెడ్డింగ్ ని మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ దగ్గరుండి జరిపించినట్లు తెలుస్తోంది.