Begin typing your search above and press return to search.

వర్మపై బ్రదర్‌ పాజిటివ్‌ రియాక్షన్‌ ఏంటో?

By:  Tupaki Desk   |   9 March 2019 10:19 PM IST
వర్మపై బ్రదర్‌ పాజిటివ్‌ రియాక్షన్‌ ఏంటో?
X
మెగా బ్రదర్‌ కొన్నాళ్ల క్రితం రామ్‌ గోపాల్‌ వర్మపై ఏ స్థాయిలో విమర్శలు చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కూడా ఒక ఇంటర్వ్యూలో అసలు రామ్‌ గోపాల్‌ వర్మ పేరు ఎత్తేందుకు కూడా నాగబాబు ఆసక్తి చూపించలేదు. అలాంటి నాగబాబు తాజాగా ఒక వెబ్‌ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వర్మపై పాజిటివ్‌ గా రెస్పాండ్‌ అయ్యాడు. అందుకు కారణం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఈమద్య కాలంలో నందమూరి - నారా వారికి చాలా యాంటీగా ఉన్న నాగబాబు వారికి వ్యతిరేకంగా తీసిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' పై పాజిటివ్‌ గా రియాక్ట్‌ అయ్యాడు.

నాకు వర్మ అంటే ఇప్పుడే కాదు - ఎప్పుడు కూడా ఇష్టం లేదు - గౌరవం లేదు. అయితే ఆయనను నేను దర్శకుడిగా ఎప్పుడు గౌరవిస్తాను అన్నాడు. ఆయన ఎన్ని ఫ్లాప్‌ లు తీసినా కూడా ఆయనలో గొప్ప దర్శకుడు ఉన్నాడు అని అందరితో పాటు నేను నమ్ముతాను అన్నాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని వర్మ అందరు అనుకునేట్లుగా - ఆకట్టుకునేట్లుగా - నిజాలను చెప్పే విధంగా తీసి ఉంటాడని నేను భావిస్తున్నాను. తప్పకుండా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకు ఉందని ఈ సందర్బంగా బ్రదర్‌ నాగబాబు చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ చాలా బాగా సాగింది. కాని పొలిటికల్‌ గా మాత్రం ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆయన చివరి జీవితం చాలా విషాదకరం. ఆ విషయాలను ఇప్పుడు వర్మ చూపించాలనుకోవడం చాలా మంచి నిర్ణయం. రామ్‌ గోపాల్‌ వర్మ నిర్ణయాన్ని - ఆయన తీస్తున్న సినిమాను గురించి నాగబాబు పాజిటివ్‌ గా రెస్పాండ్‌ అవ్వడంతో మెగా ఫాన్స్‌ తో పాటు అంతా కూడా అవాక్కవుతున్నారు.