Begin typing your search above and press return to search.

ఆ వ్య‌క్తి పేరు ప‌లికి నా నోరు పాడు చేసుకోలేను!-నాగ‌బాబు

By:  Tupaki Desk   |   8 Oct 2021 4:08 PM IST
ఆ వ్య‌క్తి పేరు ప‌లికి నా నోరు పాడు చేసుకోలేను!-నాగ‌బాబు
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. సాయంత్రానికి రిజ‌ల్ట్ కూడా తేలిపోతుంది. ప్ర‌కాష్ రాజ్ .. మంచు విష్ణు ఇరువురిలో అధ్య‌క్షుడు ఎవ‌రు? అన్న‌దానిపై ఇక మ‌రో రెండ్రోజుల్లోనే పూర్తి క్లారిటీ వ‌చ్చేస్తుంది. హోరాహోరీగా సాగుతున్న పోరులో ఎవ‌రి బ‌లం ఎంత‌? అన్న‌ది ఆ రోజు తేల్తుంది.

ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌పై మీడియా లో డిబేట్లు వేడెక్కిస్తున్నాయి. ఇరు ప్యానెళ్ల స‌భ్యులు ఎవ‌రికి వారు ప్ర‌చారం హోరెత్తిస్తున్నారు. దాదాపు 950 మంది స‌భ్యులున్న అసోసియేష‌న్ లో ఈసారి ఓటింగ్ ఎక్కువే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్ విధానం వ‌ల్ల ఓట్లు వేసేవారి సంఖ్య పెర‌గ‌నుంది.

ప్ర‌స్తుతం మంచు విష్ణు వ‌ర్గంపై నాగ‌బాబు అండ్ టీమ్ కౌంట‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా ఇంట‌ర్వ్యూలో నాగ‌బాబుకు ఓ ఆస‌క్తికర ప్ర‌శ్న ఎదురైంది. ఇటీవ‌ల రిప‌బ్లిక్ వేదిక‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ గా చెల‌రేగిన పోసాని కృష్ణ‌ముర‌ళి తీవ్ర ప‌దజాలాన్ని ఉప‌యోగించిన సంగ‌తి తెలిసిందే. దీంతో నాగ‌బాబు పోసానిపై సీరియ‌స్ గా ఉన్నారు. ఆ వ్య‌క్తి పేరు ప‌లికి నా నోరు పాడు చేసుకోలేను! అంటూ ఘాటైన వ్యాఖ్య‌ను చేశారు. ప్ర‌కాష్ రాజ్ కి ఓటేయొద్ద‌ని అంటున్న న‌టుడు సీవీఎల్ పైనా నాగ‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అలా అన‌డం స‌రికాద‌ని అన్నారు.

రిపబ్లిక్‌ వేడుకలో పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు అన్నయ్య విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్నినాని అన్నారు. కానీ అన్న‌య్య డైరెక్టుగా ఎవ‌రికీ చెప్ప‌లేదు క‌దా? కొన్ని వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు వ‌దిలేస్తే ఇండ‌స్ట్రీ బాగు కోస‌మే ప‌వ‌న్ ఆ వ్యాఖ్య‌లు చేశారు. త‌మ్ముడి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా అని నాగబాబు అన్నారు. సీవీఎల్ భాజ‌పా వ్య‌క్తి. ఆయ‌న ప్ర‌కాష్ రాజ్ కి వ్య‌తిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారు. అది స‌రికాదు. ప్ర‌కాష్ రాజ్ త‌న వారికోసం ఏమైనా చేసే త‌ర‌హా అని నాగ‌బాబు స‌మ‌ర్థించారు.