Begin typing your search above and press return to search.

జ‌గ్గూభాయ్ లా విల‌నీపై క‌న్నేశారా బ్ర‌ద‌ర్?

By:  Tupaki Desk   |   4 March 2021 5:00 AM IST
జ‌గ్గూభాయ్ లా విల‌నీపై క‌న్నేశారా బ్ర‌ద‌ర్?
X
ప్ర‌స్తుత పోటీప్ర‌పంచంలో ట్రెండును బ‌ట్టి మారితేనే అవ‌కాశాలు వెంట వ‌స్తాయి. పాత చింత‌కాయ ధోర‌ణితో ఉంటే చాలా క‌ష్టం. స‌రిగ్గా ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన హీరో జ‌గ‌ప‌తిబాబు ద‌శాబ్ధం క్రిత‌మే స‌డెన్ గా విల‌న్ గా మారారు. హీరోగా క్రేజు త‌గ్గింది అని నిజాయితీగా అంగీక‌రించి రూట్ మార్చి స‌క్సెస‌య్యారు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌హా ప‌లువురు టాప్ హీరోల సినిమాల్లో విల‌న్ పాత్ర‌ల్ని పోషించారు జ‌గ‌ప‌తి. ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంలోనూ జ‌గ‌ప‌తి సీరియ‌స్ విల‌నీతో మెప్పించారు.

ఇప్పుడు ఆయ‌న బాట‌లోనే నాగ‌బాబు విల‌న్ అవుతారా? అంటూ ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట తెర‌పైకొచ్చింది. గ‌త కొంత‌కాలంగా నాగ‌బాబు వ్య‌వ‌హార శైలి అభిన‌య వాచ‌కం చూస్తుంటే ఇలాంటి సందేహ‌మే అభిమానుల్ని నిలువ‌నీయ‌డం లేదు. ఆయ‌న ఇన్ స్టా ఫోటోలు చూస్తే మారిన గెట‌ప్ దానికి ఊతం ఇస్తోంది. బాగా గుబురుగ‌డ్డం పెంచి కోర‌మీసాన్ని మెలి తిప్పి.. హ్యాండ్ బైసెప్ పై టాట్టూతో క‌నిపిస్తున్నారు. స్లిమ్ గా ట్రిమ్ గా స్టైలిష్ హెయిర్ స్టైల్ తో క‌నిపిస్తున్నారు. పైగా మీసం మెలేస్తూ ఆయ‌న స‌వాల్ విసురుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

సోష‌ల్ మీడియాలో తాజా ఫోటోతో పాటు చ‌క్క‌ని థీమ్ లైన్ తో క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. ``నీళ్లు లేని ఎడారిలో దాహం అంటూ వెత‌క‌డం ఎలానో.. ఎఫ‌ర్ట్ పెట్ట‌కుండా దేవుడు ఏదో చేసేస్తాడ‌నుకోవ‌డం పొర‌పాటు అవుతుంది. గాల్లో దీపం ఉంచి దేవుడా నువ్వే చూడు అన‌డం లాంటిదే!`` అంటూ నాగ‌బాబు ఒక రేంజులోనే క్లాస్ తీస్కున్నారు. మొత్తానికి ఆయ‌నైతే ఫుల్ గా ఎఫ‌ర్ట్ పెట్టారు. మ‌రి రిజ‌ల్ట్ ఏంటో..!

అదిరింది రియాల్టీ షోకి నాగ‌బాబు న‌వ్వులే టీఆర్పీ తెస్తాయి కానీ... ఆయ‌న లాంటి విల‌న్లు దొర‌క్క టాలీవుడ్డే బోసిపోతోంది! అంటూ మారిన గెట‌ప్ చూసి కామెంట్లు వినిపిస్తున్నాయ్. నిజ‌మే.. అస‌లే టాలీవుడ్ విల‌న్లు లేక అల్లాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో మెగా బ్ర‌ద‌ర్ బ‌రిలో దిగితే తప్పేమీ కాదేమో! మ‌రి నాగ‌బాబు ఏమంటారో?