Begin typing your search above and press return to search.
కూతురిని అప్పగిస్తూ నాగబాబు అంత ఎమోషన్ కి గురయ్యారా?
By: Tupaki Desk | 14 Aug 2020 8:30 AM GMTఎంతైనా కూతురు కూతురే.. వేరొకరికి ఇంటికి వెళుతోంది అంటే ఏ తండ్రికి అయినా ఎమోషన్ వేరేగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఎమోషనే నిశ్చితార్థం వేళ ఆ తండ్రి నుంచి బయటపడింది. తండ్రితో పాటు అన్న కూడా ఇంచుమించు అంతే ఎమోషన్ కి గురయ్యాడు ఆ చెల్లెలి విషయమై. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి? అంటే నాగబాబు.. వరుణ్ తేజ్ గురించే.
గారాల కుమార్తె నిహారిక త్వరలోనే చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. పెద్దలు కుదుర్చిన సంబంధమిది. ఈ గురువారం ఓ ప్రయివేట్ హోటల్లో నిహారిక-చైతన్య జంట నిశ్చితార్థం జరిగింది. చిరంజీవి-సురేఖ దంపతులు ఈ వేడుకకు పెద్దరికం వహించగా.. మెగా హీరోలంతా సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలన్నీ నెటిజనుల్లో వైరల్ గా మారాయి.
దీంతో పాటు నాగబాబు.. వరుణ్ తేజ్ ఎమోషన్ గురించి నెటిజనం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. నా బేబి నిశ్చితార్థం అయ్యింది! అంటూ వరుణ్ ఎమోషన్ కి గురి కాగా.. తను అచ్చంగా నాలానే ఉంటుందని నాలానే ప్రతిదీ చేస్తుందని అంతా అంటుంటారు. ఇక తన బాధ్యత అంతా నీదే! అంటూ నాగబాబు ఎమోషన్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. అంటే అప్పుడే అల్లుడికి నాగబాబు కూతురి బాధ్యతను అప్పగించేసినట్టేనా? అంటూ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.
నిశ్చితార్థంతోనే కొత్త జంటకు ఆల్మోస్ట్ పెళ్లయిపోయినట్టే కదా! అందుకే ఒక తండ్రిగా అంతగా ఎమోషన్ కి గురయ్యారని.. కూతురంటే నాగబాబుకి.. చెల్లెలు అంటే వరుణ్ కి ఎంత ప్రేమో.. అంటూ ముచ్చటపడిపోతున్నారంతా. ఇకపై పెళ్లి ముహూర్తం గురించి సమాచారం రివీలయితే నిహారిక అభిమానుల్లోనూ అంతే ఎమోషన్ చూడొచ్చు. అన్నట్టు పెళ్లి తర్వాత నిహారిక నటిస్తుందా? లేక నిర్మాతగా కొత్త రోల్ పోషిస్తుందా? అన్నది ఇకనైనా రివీల్ చేస్తారా?