Begin typing your search above and press return to search.

ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ సెలబ్రెటీ అయిన చైతన్య

By:  Tupaki Desk   |   21 Jun 2020 4:50 AM GMT
ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ సెలబ్రెటీ అయిన చైతన్య
X
మెగా డాటర్‌ నిహారిక కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ అనే విషయం క్లారిటీ వచ్చేసింది. నిహారిక పెళ్లి గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యాన్స్‌ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో నిహారిక పెళ్లి విషయమై ఉన్న ఆసక్తి ఎంతో తాజాగా గూగుల్‌ లో చైతన్య జొన్నలగడ్డ గురించి సెర్చ్‌ ను చూస్తుంటే అర్థం అవుతోంది. మొన్నటి వరకు 1700 ఇన్‌ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ ను కలిగి ఉన్న చైతన్య కొన్ని గంటల వ్యవధిలో ఏకంగా 50 వేల ఫాలోవర్స్‌ కు చేరువ అయ్యాడు.

నిహారిక పక్కన చైతన్య కనిపించిన వెంటనే ఆయన గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పాటు సోషల్‌ మీడియాలో చైతన్య గురించి వెదకడం ప్రారంభం అయ్యింది. ప్రముఖ స్టార్స్‌ కు మాత్రమే దక్కే సెలబ్రెటీ హోద అప్పుడే చైతన్యకు దక్కింది. మెగా ఫ్యామిలీకి కాబోతున్న అల్లుడు అవ్వడంతో చైతన్య గురించి నెట్టింట జనాలు తెగ వెదికేస్తున్నారు. చైతన్య ఏం చేస్తాడు.. అసలు చైతన్య ఎవరి కొడుకు.. ఏం చదువుకున్నాడు.. హీరోగా చేయాలనే ఆసక్తి ఉందా అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్స్‌ తాపత్రయ పడుతున్నారు.

మొన్నటి వరకు చైతన్య జొన్నలగడ్డ అంటే గూగుల్‌ లో ఒక్కటి రెండు సెర్చ్‌ లు అయినా వచ్చేవో లేవో కాని ఇప్పుడు వేలల్లో జొన్నలగడ్డ చైతన్య గురించి ఆర్టికల్స్‌ ఫొటోలు విశేషాలు వస్తున్నాయి. గూగుల్‌ లో గత మూడు నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సెర్చ్‌ కాబడ్డ కీ వర్డ్స్‌ లో జొన్నలగడ్డ చైతన్య టాప్‌ లో ఉందని టెక్కీలు చెబుతున్నారు. మొత్తానికి నిహారికను పెళ్లి చేసుకోక ముందే చైతన్య స్టార్‌ సెలబ్రెటీ హోదాను దక్కించుకున్నాడు. ఇదే జోరుతో చైతన్య హీరోగా పరిచయం అవ్వాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.