Begin typing your search above and press return to search.

వరుణ్‌ పెళ్లిపై నాగబాబు కామెంట్‌.. మీకు మీకు ఓకే అయితే నేనేమంటా

By:  Tupaki Desk   |   18 March 2021 6:00 PM IST
వరుణ్‌ పెళ్లిపై నాగబాబు కామెంట్‌.. మీకు మీకు ఓకే అయితే నేనేమంటా
X
మెగా బ్రదర్ నాగబాబు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కొడుకు వరుణ్‌ కంటే కూడా అధికంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా నాగబాబు ఉంటాడు అనడంలో సందేహం లేదు. అలాంటి నాగబాబు ఇటీవల ఒక లైవ్ చాట్ లో భాగంగా వరుణ్‌ పెళ్లి విషయమై స్పందించాడు. నిహారిక పెళ్లి అయిన వెంటనే వరుణ్‌ పెళ్లి చేయాలనుకుంటున్నట్లుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నాగబాబును లైవ్ లో పలువురు వరుణ్‌ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. అందుకు నాగబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు.

వరుణ్‌ అన్న పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు బాస్ అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా.. మంచి సంబంధాలు ఉంటే చూడండి అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక మరో అభిమాని వరుణ్‌ ని ఒక మిడిల్‌ క్లాస్‌ అమ్మాయి ఇష్టపడితే.. ఆమెను వరుణ్‌ ఇష్టపడితే మీరు ఏమంటారు అంటూ ప్రశ్నించగా నాగబాబు ''మీకు మీకు ఓకే అయితే నేనేమంటా..!'' అంటూ సమాధానం ఇచ్చాడు. మొత్తానికి నాగబాబు అభిమానులకు ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తిగా ఫన్నీగా సాగాయి. మొత్తం మీద నాగబాబు సోషల్ మీడియా లైవ్‌ చిట్ చాట్ వైరల్‌ అయ్యింది.