Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో అన్న‌య్య `పెద‌రాయుడు` ఏమీ కాదు!-నాగ‌బాబు

By:  Tupaki Desk   |   10 Oct 2021 2:00 PM IST
ఇండస్ట్రీలో అన్న‌య్య `పెద‌రాయుడు` ఏమీ కాదు!-నాగ‌బాబు
X
ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాసరి నారాయ‌ణ‌రావు స్వ‌ర్గ‌స్తులైన త‌ర్వాత ప‌రిశ్ర‌మ పెద్ద దిక్కును కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ స్థానం మెగాస్టార్ చిరంజీవి భ‌ర్తీ చేసార‌ని చాలా కాలంగా ప్ర‌చారంలో ఉంది. 24 శాఖ‌లు చిరంజీవినే ఇప్పుడు పెద్ద‌గా చూస్తున్న‌ట్లు మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు హీటెక్కిస్తున్నాయి. ద‌ర్శ‌కులు..నిర్మాత‌లు..న‌టులు అంతా మెగాస్టార్ నే ఇండ‌స్ట్రీ బాస్ గా చూస్తున్న‌ట్లు చాలాసార్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో పెద్ద‌న్న పాత్ర‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అన్న‌య్య ఇండ‌స్ట్రీకి ఏమీ పెద్ద‌న్న‌య్య కాదు. దాస‌రి నారాయ‌ణ‌రావు గారు కూడా ఏ రోజు ప‌రిశ్ర‌మ పెద్ద‌గా అనుకుని ఉండ‌రు.

భ‌విష్య‌త్ లో తెలుగు ఇండస్ట్రీకి పెద‌రాయుడు పాత్ర పోషించాల‌ని ఆయ‌న అనుకుని ఉంటారా? అందుక‌నే ఆయ‌న ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చారా? దాస‌రి ప్ర‌యాణం..విప్ల‌వంలో ప‌రిణితి చెందుతూ చిన్న వాళ్ల‌కు స‌మ‌స్య‌లొస్తే ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింది. ఇప్పుడు కూడా ఎవ‌రికైనా స‌మ‌స్య‌లోస్తే చిరంజీవినే ప‌రిష్క‌రించాల‌ని ఏమీ లేదు. మోహ‌న్ బాబు గారు..నాగార్జున గారో...బాల‌కృష్ణ గారో ఎవ‌రైనా ప‌రిష్క‌రించొచ్చు. ఎవ‌రైనా బాధ్య‌త తీసుకొవ‌చ‌వ్చు. మాకు పనేంటి..? ప‌రిశ్ర‌మ‌లో మా ప‌నులు మేము చూసుకుంటాం. మా జీవితాలు మావి. అయితే `మా`..సినీ ఇండ‌స్ట్రీ సంక్షేమం కోసం క‌చ్చితంగా పాటు ప‌డ‌తాం.

ఇండ‌స్ట్రీలో స‌మ‌స్య‌లోస్తే ప‌రిష్క‌రించడానికి కృష్ణ‌..కృష్ణం రాజు...ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ క‌మ‌ర్స్ ఇలా చాలా ఉన్నాయి. అన్న‌య్య‌ని పెద్ద‌న్న‌య్య‌గా భావించి ప‌రిశ్ర‌మ‌లో ప‌ట్టు సాధించాం అనేవి అవాస్త‌వాలు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వ్యాఖ్య‌ల గురించి మాట్లాడుతూ ..సినిమా వ్య‌క్తిగా మాట్లాడుతున్నా.. ఏ ప్ర‌భుత్వంతోనైనా క‌లిసి ముందుకు వెళ్తాం త‌ప్ప‌.. ఎవ‌రితోనూ ప‌రిశ్ర‌మ వివాదాలు ఎప్పుడూ పెట్టుకోం. ఛాంబ‌ర్.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తిస్తూ ఎందుకు మాట్లాడాలి? అది వాళ్ల‌కున్న భ‌య‌మా? బ‌ల‌హీన‌తా? లేక వివాదాలు ఎందుక‌ని ఆలోచ‌నా? అన్న‌ది అర్ధం చేసుకోగ‌లం. ఫిలిం ఛాంబ‌ర్...ఇండ‌స్ట్రీ ఏ ప్ర‌భుత్వంతోనూ గొడ‌వ‌లు పెట్టుకోద‌ని నాగబాబు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసారు.

ఇండియాలో ఏ ప‌రిశ్ర‌మ కూడా ప్ర‌భుత్వాల జోలికి వెళ్ల‌దు అని అన్నారు. జ‌గ‌న్ గారు..కేసీఆర్ గారు ..బిజేపీ వాళ్లు `మా `ఎన్నిక‌ల్లో ఎందుకు వేలు పెడ‌తారు?.. అవ‌న్నీ బుర్ర లేని మాట‌లు. ఈ విష‌యాన్ని మంత్రి పేర్ని నాని కూడా ఖండించారు. ఇలాంటివ‌న్ని పెద్ద‌వాళ్ల‌కు టీక‌ప్పు లో తుఫాన్ లాంటివి. ఇక జీవిత‌రాజ‌శేఖ‌ర్-మెగా ఫ్యామిలీ వివాదం గురించి మాట్లాడుతూ.. జీవితారాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీతో రాజ‌కీయంగా విబేధాలుండొచ్చు. కానీ వ్య‌క్తిగ‌తంగా రెండు కుటుంబాల మ‌ధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఇప్పుడు రాజ‌కీయ విబేధాలు కూడా లేవు. `మా` అసోసియేష‌న్ కు సేవ‌లందించ‌డంలో జీవిత ముందున్నారు. క‌రోనా కాలంలో స‌భ్యుల కోసం ఆమె ఎన్నో సేవ‌లు అందించారు. ఈ విష‌యాన్ని `మా ` స‌భ్యులే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చెప్పారు. ఆమె అత్యంత ప్ర‌తిభావంతురాలు. ఆ న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టే మేము స‌పోర్ట్ చేస్తున్నామ‌ని నాగ‌బాబు అన్నారు. నేటి సాయంత్రానికి మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ తేల‌నుంది. ప్ర‌స్తుతం పోలింగ్ సాగుతున్న సంగ‌తి తెలిసిందే.