Begin typing your search above and press return to search.

ఆ సినిమాతో పడ్డా ..సంపాదనలో మాత్రం టార్గెట్ రీచ్ అయ్యా!

By:  Tupaki Desk   |   3 Oct 2020 11:00 PM IST
ఆ సినిమాతో పడ్డా ..సంపాదనలో మాత్రం టార్గెట్ రీచ్ అయ్యా!
X
మెగా బ్రదర్ నాగబాబు మంచి నటుడే కాదు. విజయవంతమైన నిర్మాత కూడా. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత నాగబాబు నటనకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తను సినిమాల్లో నటించడం కంటే నిర్మించడం మేలని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ స్టార్ట్ చేశాడు. తన సోదరుడు చిరంజీవితో రుద్రవీణ వంటి క్లాసిక్ సినిమా తీశాడు. బావగారూ బాగున్నారా వంటి కమర్షియల్ మూవీ తీశాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న వేళ రామ్ చరణ్ తో నాగబాబు తీసిన ఆరెంజ్ మూవీ నాగబాబును ఒక్కసారిగా పాతాళం లోకి తోసేసింది.

ఫారిన్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఆ సినిమాతో భారీగా ఖర్చు పెట్టారు. ఆ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు బాస్కర్ అంతకుముందు వరుసగా బొమ్మరిల్లు, పరుగు వంటి సినిమాలు తీసి హిట్ కొట్టి ఉండటంతో అతడిని నమ్మి నాగబాబు సినిమా మొత్తాన్ని ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే తీశారు. సినిమాకు రికార్డు స్థాయి బడ్జెట్ అయ్యింది. కానీ ఆ సినిమా విడుదల అయ్యాక అది పరాజయం పాలవడంతో నాగబాబుకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ సినిమా గురించి తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా వెల్లడించాడు.

'ఆరెంజ్ మూవీతో ఉన్నదంతా పోవడంతో చిన్నగా టీవీ రంగం వైపు దృష్టి సారించా. సినిమాలతో పాటు సీరియళ్ళు, టీవీ షోలు చేయడం మొదలు పెట్టా. ఒక్కసారిగా కోట్లు సంపాదించడం కాదు. ప్రతి ఆరు నెలలకు ఓ సారి తన లక్ష్యాన్ని మార్చు కుంటూ వెళ్ళా. మొదట్లో ఆరునెలకు మూడు లక్షలు..ఆ తర్వాత ఆరు నెలలకు ఏడు లక్షలు..అలా ఎప్పటి కప్పుడు లక్ష్యాన్ని సెట్ చేసుకుని ముందుకెళ్లా. ఇప్పటికి నా టార్గెట్ రీచ్ అయ్యా. చనిపోయేదాకా సంపాదించాలనో , అంబానీలా ఒక్కసారిగా అవ్వాలనో లక్ష్యం పెట్టుకోవడం పరమ వేస్ట్. బతికి ఉన్నప్పుడే లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకెళ్లడమే బెస్ట్' అని నాగబాబు సూచించారు.