Begin typing your search above and press return to search.

పెళ్లి ముచ్చ‌ట్ల‌‌లో హీరో, హీరోయిన్ బిజీ!

By:  Tupaki Desk   |   4 April 2021 12:52 PM GMT
పెళ్లి ముచ్చ‌ట్ల‌‌లో హీరో, హీరోయిన్ బిజీ!
X
నాగ‌శౌర్య హీరోగా, రీతూవ‌ర్మ హీరోయిన్ గా.. లక్ష్మీ సౌజన్య తెర‌కెక్కిస్తున్న మూవీ ‘వరుడు కావలెను.’ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస‌క్తిక‌ర క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచ‌నాలున్నాయి.

ఇప్ప‌టికే.. గ్లింప్స్ త‌ర‌హాలో రిలీజ్ చేసిన వీడియో క్లిప్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విడుద‌ల చేసిన లిరికల్ సాంగ్ హై రెస్పాన్స్ ను క్యాచ్ చేసింది. ‘చూపులే.. నా గుండె అంచుల్లో.. కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే..’ అంటూ సాగిపోయే మెలోడీ సంగీత ప్రియులను ఓల‌లాడిస్తోంది.

త‌న‌వైన సాంగ్స్ తో యూత్ ను ఊపేస్తున్న సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆల‌పించిన ఈ పాటకు అన్ని వ‌ర్గాల నుంచీ విశేష స్పంద‌న ల‌భించింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్ స్వ‌రాలు.. లిరిక్ రైటర్ గోసల అందించిన సాహిత్యం.. సిద్ శ్రీరాం గాత్రం పాటకు ప్రాణం పోశాయి.

కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. డ‌బ్బింగ్ స్టార్ట్ చేశారు. హీరో నాగ‌శౌర్య‌, హీరోయిన్ రీతూ వ‌ర్మ డ‌బ్బింగ్ థియేట‌ర్లో సంద‌డి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రితూ వ‌ర్మ చిరు న‌వ్వులు పూయిస్తుండ‌గా.. శౌర్య చిద్విలాసం చిందిస్తున్నాడు.