Begin typing your search above and press return to search.

అన్ని ట్రాక్ లు వ‌దిలి రైట్ ట్రాక్ లోకి

By:  Tupaki Desk   |   19 Feb 2020 11:42 AM IST
అన్ని ట్రాక్ లు వ‌దిలి రైట్ ట్రాక్ లోకి
X
సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో దేనినైనా డిసైడ్ చేసేది హిట్టు మాత్ర‌మే. ఒక్క ఫ్లాపు స‌మీక‌ర‌ణాల్ని మార్చేస్తుంది. ఒక్క హిట్టు పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ రెండిటికీ మ‌ధ్య సన్న‌ని లైన్ తెగ భ‌య‌పెట్టేస్తూ ఉంటుంది. ఫేక్ క‌లెక్ష‌న్ల‌తో హిట్టు అని ప్ర‌చారం చేసుకున్నా.. వాస్త‌వం తెలిసిన హీరోలు క‌రెక్ష‌న్ కి వ‌స్తుంటారు. ప్ర‌స్తుతం శౌర్య ప‌రిస్థితి అలానే ఉంద‌ట‌.

`అశ్వ‌థ్థామ‌` హిట్టు అంటూ ప్ర‌చారం చేసుకున్నా.. కానే కాద‌ని తేలింది. సంక్రాంతి వెళ్లాక అన్ సీజ‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా ఆశించిన బాక్సాఫీస్ రిజ‌ల్ట్ ను అందుకో లేక‌పోయింది. తొలి వీకెండ్ త‌ర్వాత‌ క‌లెక్ష‌న్ల ప‌రంగా స్పీడ్ చూపించ‌లేక‌పోయింది. అన్ సీజ‌న్ వ‌ల్ల అశ్వ‌థ్థామ‌కు క‌నీసం బ్రేక్ ఈవెన్ సాధ్యం కాలేదు. ఫేక్ క‌లెక్ష‌న్స్ తో హైప్ చేద్దామ‌నుకున్నా కానీ అదీ క‌లిసి రాలేదు. సోమ‌వారం నుంచి డెఫిషిట్ ప‌డి పోవ‌డంతో నిరాశ‌ప‌డాల్సి వ‌చ్చిందిట‌. చివ‌రికి సుమారు 2కోట్ల మేర న‌ష్ట‌మ‌ని తేలింది. సంక్రాంతి పెద్ద సినిమాల మానియా ఒక‌ ర‌కంగా ఈ సినిమాని దెబ్బ కొట్టింది. శౌర్య రిజ‌ల్ట్ పై పూర్తి ఆశ‌లు పెట్టుకున్నా.. క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ అవ్వ‌క‌ పోవ‌డ‌తో ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్ నుంచి కొన్నాళ్ల పాటు త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌.

అంతేకాదు.. అశ్వ‌థ్థామ క‌థ రాసింది శౌర్య‌నే కాబ‌ట్టి.. ఇక‌పై క‌థ‌లు రాసే ఆలోచ‌న‌ను కూడా విర‌మించుకున్నాడ‌ట‌. ఈ మూవీ క‌థ విష‌యంలో ర‌చ‌యిత‌ల సంఘంలో ఏదో లొల్లు న‌డుస్తోంద‌ని.. దాంతో ఎందుకొచ్చి గోల అని త‌న‌కు వ‌చ్చిన యాక్టింగ్ ట్రాక్ పైనే వెళ్లాల‌ని నాగ‌శౌర్య నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అన్ని ట్రాక్ లు వ‌దిలి ఇప్పుడు రైట్ ట్రాక్ లోకి వ‌చ్చాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఒక్క ఫ్లాపు అన్ని పాఠాలు నేర్పింద‌న్న‌మాట‌!