Begin typing your search above and press return to search.

ఎక్కడ 'గంగోత్రి' .. ఎక్కడ 'పుష్ప' .. ఎలా ఎదిగారన్నా: నాగశౌర్య

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:14 AM GMT
ఎక్కడ గంగోత్రి .. ఎక్కడ పుష్ప .. ఎలా ఎదిగారన్నా: నాగశౌర్య
X
ఈ మధ్య కాలంలో విడుదలకి ముందే మంచి బజ్ తెచ్చుకున్న సినిమాల జాబితాలో 'వరుడు కావలెను' కనిపిస్తుంది.
టైటిల్ తోనే అటు యూత్ .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. ఇక నాగశౌర్య - రీతూ వర్మ లుక్స్ బయటికి వచ్చిన తరువాత అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నుంచి పాటలు బయటికి వచ్చిన తరువాత ఎప్పుడు విడుదలవుతుందా అనే ఒక కుతూహలం అందరిలో మొదలవుతూ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ .. ఆడిటోరియంలోని అభిమానులతో .. " మీకు నచ్చిన వ్యక్తిని గురించే చెప్పబోతున్నాను. అప్పటివరకూ కాస్త సైలెంట్ గా ఉండండి. అంటూ బన్నీని ఉద్దేశించి .. "అన్నా ఫస్టు టైమ్ 2009లో నిన్ను చూశానన్నా. అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నేను మా ఫ్రెండ్ తో 'అరేయ్ నేను డాన్స్ నేర్చుకోవాలి .. ఎక్కడికి వెళ్లాలిరా' అని అడిగాను. అప్పుడు వాడు బన్నీ డాన్స్ క్లాస్ కి నన్ను తీసుకెళ్లాడు. అప్పటికే బన్నీ స్టార్ .. అక్కడ ఆయన డాన్స్ చేస్తుంటే చూసి షాక్ అయ్యాను. అందుకు కారణం .. అప్పటికి ఆయన లెఫ్ట్ హ్యాండ్ విరిగిపోయి ఉన్నాడు. అయినా ఆ కట్టుతో డాన్స్ చేస్తూనే ఉన్నాడు.

అప్పుడు 'వరుడు' సినిమా కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావన్నా, ఆ సమయంలో నేను మీ వెనుకనే ఉన్నాను. అప్పుడు అనిపించింది .. అభిమానులు ఈ రేంజ్ లో అరవాలంటే ఆ స్థాయిలో కష్టపడాలని. ఈ జనరేషన్ కి ఆయన స్ఫూర్తి. ఇప్పటికీ డాన్స్ లో సౌత్ ఇండియాలో ఆయనను కొట్టేవారు లేరంటే ఆయన ఎన్నో రాత్రులు పడిన కష్టం అది. ఎక్కడ 'గంగోత్రి' .. 'ఎక్కడ 'అలా వైకుంఠపురం' .. ఎక్కడ 'పుష్ప'. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ అన్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ గా విన్నాను .. బన్నీగా విన్నాను .. స్టైలీష్ స్టార్ గా విన్నాను .. ఇప్పుడు ఐకాన్ స్టార్ అంటున్నారు. ఎలా ఎదిగారన్న మీరు .. నిజంగా మీకు హ్యాట్సాఫ్.

అభిమానులను ఉద్దేశించి .. "ఫైనల్ గా మీకు ఒక మాట చెబుదామని అనుకుంటున్నాను. అక్టోబర్ 29వ తేదీన మా మూవీ 'వరుడు కావలెను' సినిమా వస్తోంది. అలాగే 'రొమాంటిక్' మూవీ కూడా వస్తోంది. అందరూ థియేటర్లలో చూడండి .. రెండూ డిఫరెంట్ మూవీస్. నేను ఆకాశ్ పూరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆకాశ్ పూరిని ఉద్దేశించి .. 'నువ్వు గెలిచావా? .. నేను గెలిచినా? అని కాదు .. కలిసి గెలుద్దాం" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగశౌర్య చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడు. ఈ సినిమా పక్కా హిట్ అంటూ చాలా బలంగా చెప్పాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.