Begin typing your search above and press return to search.

24న @నర్తనశాల ప్రీ రిలీజ్

By:  Tupaki Desk   |   19 Aug 2018 11:26 AM IST
24న @నర్తనశాల ప్రీ రిలీజ్
X
ఈ ఏడాది ఛలోతో గట్టి బోణి కొట్టిన నాగ శౌర్య హీరోగా రూపొందుతున్న @నర్తనశాల విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ విషయంలో చాలా అడ్వాన్స్ గా ఉన్న టీమ్ ఛలో తరహాలోనే దీన్ని కూడా జనానికి చేర్చేలా మంచి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. కేవలం ఒక్క రోజు తేడాతో నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడుతో పోటీ ఉన్నప్పటికీ ఆ విషయంలో నర్తనశాల యూనిట్ చాలా ధీమాగా ఉంది. కంటెంట్ ఉన్నప్పుడు ఎంత పోటీ ఉన్నా ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ఇక దీని తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ 24న చేయబోతున్నారు. ఇప్పటికే @నర్తనశాల టీజర్ తో పాటు ఒక ఆడియో ట్రాక్ ఒక పూర్తి వీడియో సాంగ్ ఆన్ లైన్ లో విడులయ్యాయి. అనూహ్యంగా స్పందన కూడా మిలియన్లలో ఉండటం టీమ్ కి మాంచి జోష్ ఇస్తోంది. దాన్ని అలాగే కాంటిన్యు చేసే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లే చేసుకుంటోంది నాగ శౌర్య ఫ్యామిలీ బ్యానర్ ఐరా క్రియేషన్స్.

ఛలో ప్రీ రిలీజ్ మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. అది బాగా హెల్ప్ అయ్యింది కూడా. చిరు చెప్పిన మాటలు ప్రమోషన్ కు ఉపయోగపడ్డాయి. ప్రతిసారి ఆయన్నే తీసుకురావడం సాధ్యపడకపోవచ్చు కాబట్టి ఈసారి ఎవరు అతిధిగా వస్తారా అనే దాని గురించి ఆసక్తి నెలకొంది. @నర్తనశాలలో నాగశౌర్య అమ్మాయిల ట్రైనింగ్ కాలేజీ లో టీచింగ్ ఇన్స్ స్ట్రక్టర్ గా కనిపిస్తాడు. అలా ఉండే తను బృహన్నల లక్షణాలతో కొంత కాలం ఉండే పరిస్థితి వస్తుంది. అది ఎందుకు జరిగింది హీరోయిన్ తో తనకు ప్రేమ ఎలా మొదలైంది తదితరాలన్ని ఆసక్తిగొలిపే రీతిలో దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దీన్ని తీర్చిదిద్దినట్టు సమాచారం. ఛలోలో టాలెంట్ చాటిన మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ సంగీతం మరోసారి శౌర్య మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా మారనుంది. 30 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని అందరిని తప్పకుండా అలరించే సినిమా @నర్తనశాల అవుతుందని నిర్మాతలు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఛలోతో బోణీ కొట్టిన నాగ శౌర్య సెకండ్ హాఫ్ లో @నర్తనశాలతో దాన్ని కొనసాగించేది 30న తేలిపోతుంది.