Begin typing your search above and press return to search.
మళ్లీ మెగా సెంటిమెంటా శౌర్యా?
By: Tupaki Desk | 30 Jan 2020 2:17 PM ISTయంగ్ హీరో నాగశౌర్య ఎంటైర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది `ఛలో`. సొంతంగా ఐరా క్రియేషన్స్ స్థాపించి అదే సంస్థలో ప్రతిష్టాత్మకంతా తెరకెక్కించి సక్సెస్ కొట్టాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కు మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి మరీ సక్సెస్ అందుకున్నాడు. మెగాస్టార్ రాకతో రిలీజ్ కు ముందు బొలెడంత హైప్..రకరకాల కథనాలు అంతే వెడెక్కించాయి. తర్వాత రెండు..మూడు సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా అశ్వథ్థామ.
ఈ సినిమా కోసం యంగ్ హీరో రచయితగానూ మారాడు. సక్సెస్ అనివార్య మైన తరుణమిది. ఎలాగైనా సక్సెస్ కొట్టి గెలుపు గుర్రమెక్కాలని ఆరాట పడుతున్నాడు. అశ్వాథ్థామ సక్సెస్ ఒక్కటే యంగ్ హీరో కెరీర్ ని డిసైడ్ చేసేది! అన్నది కూడా ఓ ప్యాక్టర్ గా మారిందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య మరోసారి మెగాసెంట్ మెంట్ ని ఫాలో అవుతున్నాడా? అందుకోసం మెగాస్టార్ చిరంజీవి ని రంగంలోకి దించుతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. ఈనెల 31న అశ్వథ్థామ రిలీజ్ అవుతుంది.
ఇప్పటికే 70 ఓపెనింగ్ బుకింగ్స్ తో మార్నింగ్స్ షోస్ ఫుల్ అయ్యాయి. దీంతో మెగాస్టార్ ని ప్రివ్యూ షోకి ఆహ్వానించినడానికి నాగశౌర్య..నిర్మాతలు వెళ్లినట్లు సమాచారం. మెగాస్టార్ గనుక వచ్చి సినిమా కు బూస్ట్ ఇచ్చినట్లు అయితే కలిసొస్తుంది. మరి మెగాస్టార్ సమయం కేటాయిస్తారా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ సినిమా షూటింగ్ లో లో ఫుల్ బిజీగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. రేయింబవళ్లు షూటింగ్ కి హాజరవుతున్నారు. ఇంత టఫ్ షెడ్యూల్ నడుమ నాగశౌర్య మెగాస్టార్ ఇంటి తలుపు తట్టాడు. మరి మెగాస్టార్ వచ్చి ఛలో హిట్టు సెంటిమెంట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.