Begin typing your search above and press return to search.

ఒక మనసు' ఇచ్చినోడి పరిస్థితి బాలేదే?

By:  Tupaki Desk   |   10 May 2016 10:27 PM IST
ఒక మనసు ఇచ్చినోడి పరిస్థితి బాలేదే?
X
మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూతురు హీరోయిన్ నటించిన మొదటి సినిమా 'ఒక మనసు' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు పూర్తయిపోయి ఫస్ట్ కాపీ చేతిలో ఉన్నా.. రిలీజ్ డేట్ దొరక్క ప్రస్తుతానికి ఈ మూవీని హోల్డ్ చేశారు. భారీ చిత్రాల హంగామా పూర్తయిపోగానే 'ఒక మనసు' రిలీజ్ చేయాలన్నది నిర్మాతల ఆలోచన. అయితే.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం బాగానే కేర్ తీసుకుంటోంది యూనిట్.

'ఒక మనసు' కోసం పబ్లిసిటీ కార్యక్రమాలన్నీ హీరోయిన్ నీహారిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఇందులో హీరోగా నటించిన.. అంటే తన ఒక్కగానొక్క మనసును అమ్మాయికి ఇచ్చిన కుర్ర హీరో నాగశౌర్య పేరు మాత్రం వినిపించడం లేదు. దీన్ని నీహారిక లాంఛింగ్ మూవీగా తప్ప.. ఇప్పటికే హీరోగా కుదురుకున్న నాగశౌర్య సినిమా అని ఎవరూ భావించకపోవడం.. ఈ హీరోని నిరుత్సాహపరుస్తోందిట.

త్వరలో 'ఒక మనసు' ఆడియో లాంఛ్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ - వరుణ్ తేజ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు రానున్నారు. అప్పుడు అంతా మెగా జపం తప్ప నాగశౌర్యను అసలు పట్టించుకునే ఛాన్స్ ఉండదు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో తనకు ప్రాధాన్యం దక్కకపోవడంపై నాగశౌర్య బాగా అప్ సెట్ అవుతున్నాడని టాక్.