Begin typing your search above and press return to search.

85 లక్షలతో యూజ్డ్ కార్ కొన్న నాగ్

By:  Tupaki Desk   |   16 March 2016 10:29 AM IST
85 లక్షలతో యూజ్డ్ కార్ కొన్న నాగ్
X
కుర్ర హీరో నాగ శౌర్యకు ఇప్పుడు మంచి టైం నడుస్తోంది. కళ్యాణ వైభోగమే హిట్ సాధించాడు. మెగాడాటర్ తో చేసిన ఒక మనసు రిలీజ్ కి రెడీ అవుతోంది. నారా రోహిత్ తో కలిసి చేస్తున్న జ్యో అచ్యుతానందపైనా మంచి హోప్స్ ఉన్నాయి. ఈ హీరోకి కార్లంటే విపరీతమైన అభిమానం. ఆ ఇష్టంతోనే రీసెంట్ గా ఓ ఆడీ కార్ కొన్నాడు. దాని ఖరీదెంతో తెలుసా. అక్షరాలా ఎనభై ఐదు లక్షలు. ఇంత కాస్ట్ పెట్టి నాగశౌర్య కొన్నది సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఆశ్చర్యం వేసినా, అది నిజమే.

యూజ్డ్ కార్స్ అంటే ఎవరో వాడేసిన బాపతు అనే ఫీలింగ్ ఈమధ్య తగ్గిపోతోంది. లగ్జరీ కార్ల విషయంలో వీటివైపు చాలామంది మొగ్గుతున్నారు. కొత్త కార్ల కాస్ట్ కోట్లలో ఉండడం, వీటితో పోల్చితే యూజ్డ్ కార్ చాలా తక్కువ మొత్తానికి వస్తుండడమే దీనికి కారణం. ప్రస్తుతం నాగశౌర్య కొన్న కార్ ఆడీ ఏ8ఎల్. యూజ్డ్ కాకుండా.. కొత్త కార్ కొనాలంటే దీని రేట్ కోటీ 20 లక్షలు. అది కూడా ఎక్స్ షోరూం ధరే. టాక్సులు ఇంకా మోగుతాయ్.

కల్యాణ వైభోగమే సక్సెస్ చేస్తున్న నాగశౌర్య.. తన ఆనందాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడే కాకుండా, ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. వచ్చే నెలలో విడుదల కానున్న ఒకమనసు చిత్రంలో మెగాడాటర్ నీహారిక కొణిదెల హీరోయిన్ కావడంతో.. మూవీపై చాలానే అంచనాలు ఉన్నాయి.