Begin typing your search above and press return to search.

యంగ్ హీరో నోట్ అయ్యాడు

By:  Tupaki Desk   |   25 Sept 2018 1:55 PM IST
యంగ్ హీరో నోట్ అయ్యాడు
X
ఇప్పుడుకున్న 4జి యుగంలో ఓ చిన్న ఆటో డ్రైవర్ మొదలుకుని అంత పెద్ద అంబానీ దాకా మొబైల్ ఫోన్ అందులోనూ స్మార్ట్ ఫోన్ చాలా మాములు విషయమైపోయింది. ఒకటికి రెండు మొబైళ్ళు వాడటం కూడా ట్రెండ్ గా మారిపోయింది. అలాంటిది ఓ హీరోకి సెల్ ఫోన్ లేదంటే నమ్మగలమా. కానీ ఇది నిజంగా నిజం. నాగ శౌర్యకు ఇప్పటి దాకా మొబైల్ ఫోన్ వాడే అలవాటు లేదు. కారణాలు ఇప్పుడు అప్రస్తుతం కానీ ఫైనల్ గా మనోడు ఈ బ్యాచ్ లోకి ఎంటరై పోయాడు.

సాధారణంగా సెలెబ్రిటీలు ఐ ఫోన్లు వాడతారు. కానీ శౌర్య మాత్రం దానికి భిన్నంగా ఇటీవలే శాంసంగ్ విడుదల చేసిన అత్యాధునిక గాలక్సీ నోట్ 9 తీసుకున్నాడు. దాని తాలూకు పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న శౌర్య ఇన్నేళ్ల తర్వాత నా చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చింది నేనో ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నానా అంటూ ఓ ఆసక్తికరమైన మెసేజ్ కూడా పోస్ట్ చేసాడు.

సో ఇకపై నాగ శౌర్యను వెంటనే కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నిమిషాల్లో అతని కొత్త స్మార్ట్ ఫోన్ కి డయల్ చేయటమే. ఇటీవలే @నర్తనశాల ఫలితంతో నిరాశ చెందినా ఓ కొత్త ప్రయత్నం చేశానన్న తృప్తిలో ఉన్న నాగ శౌర్య ఇకపై కూడా ప్రయోగాలు ఆపను అంటున్నాడు. రాజు కొలుసు దర్శకత్వంలో చేస్తున్న మూవీకి నారి నారి నడుమ మురారి టైటిల్ పరిశీలనలో ఉంది. రమణ తేజతో ఓ సినిమా కమిట్ అయ్యాడు శౌర్య. గణ అనే పేరు ఫిక్స్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్. వేరే ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి,

ఛలో సూపర్ హిట్ తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్న శౌర్య ఇకపై ఇంకా అలెర్ట్ గా ఉండాలని ఛలో తర్వాత వచ్చిన మూడు సినిమాల ఫలితాలు హెచ్చరించాయి. సోషల్ మీడియాలో కొత్త ఫోన్ తో ఫోటో అయితే పెట్టాడు కానీ నెంబర్ చెప్పలేదు లెండి. చెబితే ఇంకేమైనా ఉందా. అభిమానుల తాకిడి భరించడం కష్టం.