Begin typing your search above and press return to search.

పిక్ టాక్: స్టన్నింగ్ లుక్ లో హ్యాండ్సమ్ హంక్..!

By:  Tupaki Desk   |   17 July 2021 5:30 PM GMT
పిక్ టాక్: స్టన్నింగ్ లుక్ లో హ్యాండ్సమ్ హంక్..!
X
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగ‌శౌర్య ఆ మధ్య సినిమా సినిమాకి మేకోవ‌ర్ అవుతున్నాడు. బాడీ పై ఫుల్ ఫోకస్ పెట్టిన శౌర్య.. జిమ్ లో భారీ వర్కవుట్స్ చేస్తూ పర్ఫెక్ట్ సేఫ్ కి వచ్చాడు. ఇన్నాళ్లూ చాక్లట్ బాయ్ - లవర్ బాయ్ గా కనిపించిన యంగ్ హీరో.. ఇప్పుడు కండలు తిరిగిన బాడీతో వావ్ అనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాగశౌర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''ఇంపార్టెన్స్ అనేది ఎల్లప్పుడూ ఫోటో గురించి కాదు, సందేశం గురించి. దాని కోసం వర్క్ చేయండి, సాధించండి, దాన్ని చెరిష్ చేయండి. ఏది ఏమైనా సరే!'' అని తాజాగా పోస్ట్ చేసిన నాగ శౌర్య.. ఓ ఫోటోని సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేశాడు. శౌర్య లేటెస్ట్ స్టన్నింగ్ క్లిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న శౌర్య.. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజరబుల్ మెన్-2020 లిస్టులో 5వ స్థానంలో నిలిచాడు.

ఇకపోతే శౌర్య ప్రస్తుతం హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'లక్ష్య' లో ఆర్చరీ ఆటగాడిగా కనిపించడానికి బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. అతని డెడికేషన్ కు కమిట్ మెంట్ కు అందరి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. శౌర్య కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే కొత్త దర్శకురాలు లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో 'వరుడు కావలెను' సినిమాలో హీరోగా నటిస్తున్నారు శౌర్య. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగశౌర్య తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు.

ఇదే క్రమంలో కె.పి. రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' అనే చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీమాన్ దర్శకత్వంలో '#NS24' ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనే సినిమా చేయాల్సి ఉంది. ఇలా చేతి నిండా సినిమాలతో హ్యాండ్సమ్ హంక్ నాగ శౌర్య బిజీబిజీగా ఉన్నాడు.